సంచలనం.. గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం!

Himachal Pradesh, Weed Cultivation, Ganja: గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ.. ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాని గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Himachal Pradesh, Weed Cultivation, Ganja: గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ.. ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాని గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

కొంతమంది గంజాయికి అలవాటై.. మెల్లమెల్లగా బానిసలుగా మారుతున్నారు. గంజాయి మత్తులోనే అనేక దారుణాలకు కూడా తెగబడుతున్నారు.. ఇక విధంగా గంజాయి అనేది సమాజాన్ని చెడగొడుతున్న ఒక ఆయుధంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఓ రాష్ట్ర అసెంబ్లీ గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలని ఏకంగా అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసింది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం సంచలన తీర్మానం చేసింది. రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధత కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలనే విషయం ముందుగా ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయాన్ని తీసుకున్నామని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఈ గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించింది.. మత్తుమందును విచ్చలవిడిగా అందించేందుకు కాదులేండి. కేవలం ఔషధ, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని వెనుక కేవలం సదుద్దేశం మాత్రం ఉందని, గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించడంతో ఎలాంటి దారుణాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తామని కూడా పేర్కొంది.

అయితే.. ఇప్పుడు గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించడంతో.. ఈ పంటను చాలా మంది రైతులు విరివిగా పండించే అవకాశం ఉంది. దాంతో.. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం కూడా సమకూరుతుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి విపక్షాలు కూడా మద్దతు పలికాయని హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి అన్నారు. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో చట్టబద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు నమూనాలను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా.. కేవలం ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం అయితే.. పర్లేదు కానీ, అది కాస్త దారి తప్పి యువతకు అందుబాటులోకి వస్తే సమాజం మరింత చెడిపోతుందని కొంతమంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments