SNP
SNP
హిమాలయా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు ఎవరెస్ట్ పర్వతం చూసేందుకు వచ్చిన మెక్సికో దేశానికి చెందిన పర్యాటకులు అని సమాచారం. ఐదుగురు పర్యాటకులతో పాటు పైలెట్ సైతం దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఎవరెస్ట్ పర్వతం, ఇతర ఎత్తైన హిమాలయ శిఖరాలకు నిలయమైన సోలుఖున్‌వు ప్రాంతంలోని సుర్కే నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంది.
అయితే ప్రయాణం ప్రారంభించిన 15 నిమిషాలకే అది సిగ్నల్స్ కోల్పోయింది. ఎవరెస్ట్ పర్వతాన్ని వీక్షించి నేపాల్ రాజధాని ఖాట్మండుకు తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఛాపర్.. మనంగ్ ఎయిర్ సంస్థకు చెందినగా సమాచారం. ఉదయం 10.15 నిమిషాలకు సిగ్నల్స్ కోల్పోగా.. చిహందండ వద్ద హెలికాప్టర్ శకలాలు కనిపించాయి. మనంగ్ ఎయిర్ ఆపరేటింగ్, సేఫ్టీ మేనేజర్.. భద్రతా అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.