P Krishna
Helicopter Crashes: ఇటీవల విమానం, హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాాదాలకు గురికావడంతో ఎంతోమంది ప్రయాణికులు చనిపోతున్నారు.
Helicopter Crashes: ఇటీవల విమానం, హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాాదాలకు గురికావడంతో ఎంతోమంది ప్రయాణికులు చనిపోతున్నారు.
P Krishna
సాధారణంగా సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవాలంటే విమానం, హెలికాప్టర్ ప్రయాణాలు చేస్తుంటారు. ఆకాశ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లగ్జరీగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఇంజన్ లో మంటలు రావడం, సాంకేతిక లోపాలు, ప్రకృతి అనుకూలించకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి కాపాడుతున్న సంఘనలు ఎన్నో ఉన్నాయి. కానీ.. కొన్నిసార్లు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోతున్నార. తాజాగా ముంబై నుంచి హైదరాబాద్ కి వస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పూణె లోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ కి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. అదృష్టం కొద్ది వీరంతా బతికి బయటపడ్డారని అన్నారు. వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినది పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం నుంచి పూణెలో భారీ వర్షాలు పడుతున్నాయి.
#Breaking | A helicopter en route from Mumbai to Hyderabad has crashed near Paud village in Pune district with four people on board.
While weather conditions might be a factor, the exact cause of the crash is still under unknown…- @AruneelS joins @Swatij14 with latest details. pic.twitter.com/YDk49KpE4C
— TIMES NOW (@TimesNow) August 24, 2024