iDreamPost
android-app
ios-app

వీడియో: ఆర్మీ చాపర్ నుంచి జారిపడిన హెలికాప్టర్! అసలేం జరిగిందంటే..

Helicopter Crash in Uttarakhand: తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఫ్లైట్, హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ హెలికాప్టర్ వేల అడుగుల నుంచి జారి పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Helicopter Crash in Uttarakhand: తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఫ్లైట్, హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ హెలికాప్టర్ వేల అడుగుల నుంచి జారి పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో: ఆర్మీ చాపర్ నుంచి జారిపడిన హెలికాప్టర్! అసలేం జరిగిందంటే..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో హెలికాప్టర్, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. సాకేంతిక సమస్యలు, ఇతర కారణాలతో ఈ ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవలే ఓ ప్రాంతంలో విమానం కూలిపోయి.. 9 మంది మృతి చెందారు. ఇది ఇలాఉంటే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్లు కొండల్లో పడిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

వేల అడుగుల ఎత్తులో నుంచి హెలికాప్టర్ జారిపడిన ఘటన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో గత భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రను కూడా నిలిపివేశారు అధికారులు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ యాత్రికులను తరలించే క్రెస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఆగిపోయింది. కేదార్‌నాథ్‌లో భక్తులను దించి, తిరిగి వెళ్తుండగా టెక్నికల్ ఇష్యూ కారణంగా కూలిపోయింది.

అలా కూలిపోయిన, దెబ్బతిన్న ఆ హెలికాప్టర్ ను అక్కడి నుంచి తరలించాలనే ఆర్మీ సైన్యం భావించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 భారీ చాపర్ ద్వారా తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ చాపర్‌కు తీగలు కట్టి.. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ హెలికాప్టర్ కేదార్‌నాథ్‌-గచౌర్‌ మధ్యలోని భీంబాలి ప్రాంతానికి చేరుకుంది. ఇదే సమంయలో ఆ హెలికాప్టర్‌ను తీసుకెళ్తున్న ఎంఐ-17 హెలికాప్టర్‌ పైలట్.. ఓ ప్రమాదాన్ని గుర్తించారు. ఒక్కసారిగా ఎంఐ -17 హెలికాప్టర్ బ్యాలెన్స్ అదుపుతప్పింది. దీంతో ఎలాగైనా ప్రమాదాన్ని తప్పించాలని ఫైలట్ భావించాడు.

ఆ హెలికాప్టర్ ను జారవిడిస్తేనే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని అనుకున్నాడు. దీంతో వెంటనే ఆ కొండల్లో ఖాళీ స్థలాన్ని గుర్తించి.. ఆ క్రెస్టల్ హెలికాప్టర్‌ను జారవిడిచాడు. ఇక ఈ ప్రమాద విషయం తెలిసిన రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. అక్కడి పరిస్థితిని అంచనా వేసింది. అలానే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ చోటు చేసుకోలేదని జిల్లా  అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని.. ఎవరూ చనిపోలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొండల మధ్య హెలికాప్టర్ జారిపోతున్న దృశ్యాలను అక్కడే ఉండే స్థానికులు వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.