Business Tycoon: ఆవుని నమ్ముకున్నాడు.. ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న రైతు..

ఆవుని నమ్ముకున్నాడు.. ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న రైతు..

పొద్దున్నే ఆఫీసుకు పోయి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకుని.. నెల ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తుంటారు వేతన జీవులు. కొంత మందికి వ్యాపారం చేాయాలన్న ఆలోచన ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వెనకడుగులు వేస్తుంటారు. ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమౌతుంటారు.

పొద్దున్నే ఆఫీసుకు పోయి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకుని.. నెల ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తుంటారు వేతన జీవులు. కొంత మందికి వ్యాపారం చేాయాలన్న ఆలోచన ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వెనకడుగులు వేస్తుంటారు. ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమౌతుంటారు.

ఎంత కష్టపడి పనిచేసినా కొన్ని సార్లు సంతృప్తి ఉండదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేసుకుని, ముప్పుతిప్పలు పడుతూ, ట్రాఫిక్‌తో చుక్కలు కనిపిస్తున్నా.. నెల  మొదట్లో అందే జీతం కోసం వాటిని అధిగమించి లైఫ్ నెట్టుకొస్తున్న మానవ జీవాలు కోకోల్లలు. చదివిన చదువుకు ఉద్యోగం రాక, దొరికిన పనేదో చేసుకుంటూ.. నెలవారి కూలీలుగా మారిపోతున్నారు. పోనీ ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే పది రూపాయలు అప్పు పుట్టడమే కష్టమైన ఈ రోజుల్లో.. లక్షలు ఇచ్చే నాధుడెవ్వరూ అని ఆలోచిస్తుంటారు. కానీ చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆశ కల కలగా ఉండిపోతుంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కలను సాకారం చేసుకుని .. నేడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు రమేష్ రూపరేలియా.

దేశంలో కోటీశ్వరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాతే అంటుంటారు. దేశ దిగ్గజ వ్యాపారస్థులు గౌతమ్ ఆదానీ, అంబానీ కుటుంబం, చిరాయు అమిన్ ఆ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. అంటే వ్యాపార మెళుకువలు, డబ్బు ఎలా ఆర్జించాలి వంటివి తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపార వేత్త కూడా గుజరాతీనే. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా పాల వ్యాపారం వైపు అడుగులు వేశాడు రమేష్. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యాపార సంస్థగా పేరు గాంచింది. అదే శ్రీ గిర్ గౌ కృషి జతన్ సంస్థ. దీనికి అధిపతి రమేష్. కేవలం 7వ తరగతి చదువుకున్నా.. జీవితం నేర్పిన పాఠాలు అతడిని వ్యాపారిగా మార్చాయి. తండ్రి సలహా మేరకు ఆవులను పెంచుతూ.. ఆ తర్వాత పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

తొలుత ఈ వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు పెరిగిపోయాయి. దీంతో వ్యవసాయాన్ని నమ్మాడు రమేష్. ఉల్లి పంట మంచి దిగుమతి అందించడంతో రూ. 35 లక్షల ఆదాయం పొందారు. తిరిగి తనకెంతో ఇష్టమైన ఆవుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలుత కొన్ని గిర్ ఆవులను కొనుగోలు చేసి.. శ్రీ గిర్ గౌ కృషి జాతన్ సంస్థను స్థాపించాడు. పాలు విక్రయిస్తుండగా.. వాటి వాసనపై కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో నెయ్యి తయారు చేయడం ప్రారంభించాడు. ఆ నెయ్యిని ప్యాక్ చేసుకుని సైకిల్ పై తీసుకెళ్లి అమ్మేవాడు. ఆ నెయ్యి ఉత్పత్తికి మంచి పేరు రావడంతో.. దాన్ని కొనసాగిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. అలా కేజీ నెయ్యితో ప్రారంభమైన ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ నెయ్యిని 123 దేశాలకు ఎగుమతి చేస్తూ.. ఏటా రూ. 8 కోట్లను సంపాదిస్తున్నాడు.

Show comments