iDreamPost
android-app
ios-app

వీడియో: మేనకోడలి పెళ్లిలో కాసుల వర్షం కురిపించిన మేనమామ.. కోట్ల రూపాయలు కానుకగా

  • Published Dec 02, 2023 | 10:12 AM Updated Updated Dec 02, 2023 | 10:12 AM

మేనకోడలి వివాహం సందర్భంగా ఓ వ్యక్తి భారీ ఎత్తున కట్నకానుకలు అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

మేనకోడలి వివాహం సందర్భంగా ఓ వ్యక్తి భారీ ఎత్తున కట్నకానుకలు అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

  • Published Dec 02, 2023 | 10:12 AMUpdated Dec 02, 2023 | 10:12 AM
వీడియో: మేనకోడలి పెళ్లిలో కాసుల వర్షం కురిపించిన మేనమామ.. కోట్ల రూపాయలు కానుకగా

మేనమామ అంటే తండ్రి తర్వాత తంత్రి లాంటి వాడు అని భావించే సమాజం మనది. చెల్లెల్లి బిడ్డలను తమ సొంత బిడ్డలుగా చూసుకుంటారు. అలానే సోదరి బిడ్డల జీవితాల్లో జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో మేనమామ పాత్ర ఎంతో కీలకం. మన దగ్గర అయితే వివాహ సమయంలో కొన్ని సామాజిక వర్గాల్లో మేనమామే మెట్టలు పెడతాడు. ఒకవేళ తండ్రి లేకపోతే.. తానే మేనకోడలికి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తాడు. ఇక వివాహాల సమయంలో మేనమామ.. తనకు తోచిన రీతిలో పెట్టుపోతలు పెడతాడు. ఈక్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మేనకోడలి పెళ్లి సందర్భంగా కోట్ల రూపాయలు కానుకలు ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..

వితంతు సోదరి కుమార్తె పెళ్లి సందర్భంగా ఓ వ్యక్తి ఏకంగా రూ.1 కోటి, 1 లక్షా, 11 వేల 101 నగదు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాక కోటి రూపాయలు విలువ చేసే నగలు కూడా బహుకరించాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని రేవారీ నగరంలో వెలుగు చూసింది. అసల్వాస్ సత్బీర్ అనే వ్యక్తి ఒక సోదరి ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. కొన్ని రోజుల క్రితం మేనకోడలికి వివాహం నిశ్చయమైంది.

ఇక తండ్రి లేని మేనకోడలికి.. తానే తండ్రిలా మారాడు. సొంత కుమార్తె వివాహానికి ఏవిధంగా ఖర్చు చేస్తాడో.. అలానే మేనకోడలి పెళ్లికి కూడా భారీ ఎత్తున కట్నకానుకలు ఇచ్చి.. అందరిని ఆశ్యర్యానికి గురి చేశాడు. సిందర్పూర్ లో జరిగిన మేనకోడలి పెళ్లి సందర్భంగా ఏకంగా కోటి రూపాయల నగదు, అలానే కోటి రూపాయల విలువ చేసే ఆభరణాలు కానుకగా ఇచ్చాడు. మేనకోడలి వివాహం సందర్భంగా.. సోదరి ఇంట్లో పెళ్లి కార్యక్రమాలను నిర్వహించడానికి తన గ్రామ ప్రజలతో కలిసి వారి ఇంటికి వెళ్ళాడు సత్బీర్.

సాయంత్రం పెళ్లి క్రతువులు ప్రారంభం కాగానే అక్కడ కనపించిన సీన్ చూసిన బంధువులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి కళ్ల ఎదురుగా 500 రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా పేర్చి ఉన్న సీన్ చూసి షాక్ అయ్యారు. మేనకోడలి పెళ్లి సందర్భంగా ఏకంగా రూ.1 కోటి, 1 లక్షా, 11 వేల 101 నగదు ఇచ్చాడు. అలానే మరో కోటి రూపాయల విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చాడు.

సత్బీర్ తన గ్రామంలో సొంతంగా క్రేన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాదు.. అతడు పెద్ద భూస్వామి కూడా. సత్బీర్ తన స్వగ్రామంలోనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, అతను ఎప్పుడూ తన సోదరికి అండగా ఉంటూ, అన్ని వేళలా సహాయం చేస్తూనే ఉంటాడని తెలిసింది. ఇక ఒక్కగానొక్క మేనకోడలి పెళ్లి సందర్భంగా భారీగా కట్నకానుకలు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş