మహిళా జడ్జికి వేధింపులు! ఎక్కడంటే?

ఈ మద్యకాలంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య మహిళలే కాదు.. ఉన్నత హూదాలో ఉన్న వారిపై కూడా రక రకాల వేధింపులు జరుగుతున్నాయని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ మద్యకాలంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య మహిళలే కాదు.. ఉన్నత హూదాలో ఉన్న వారిపై కూడా రక రకాల వేధింపులు జరుగుతున్నాయని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి.

దేశంలో ప్రతిరోజూ మహిళలై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలు, పెద్ద హోదాలో ఉన్నవారికి కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారికి పలు సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉంటాయని వాపోతున్నారు. ఇటీవల సాక్షాత్తూ ఓ న్యాయమూర్తే తాను ఘోరమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాజంలో నేరాలు చేసేవారికి శిక్షలు విధించే న్యాయమూర్తలే వేధింపులకు గురి అవుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాను న్యాయంగా ఉండటం వల్ల వేధింపులకు గురయ్యానని మహిళా జడ్జీ ఆరోపించింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జడ్జీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరికీ సమ న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తామని.. ఈ క్రమంలోనే న్యాయపరంగా ఎవరి ప్రలోభాలకు లొంగకపోవడంతో తన సర్వీస్ సమయంలో పలువురు న్యాయమూర్తులు, లాయర్లు వేధింపులకు పాల్పపడ్డారని, వారిపై ఫిర్యాదులు చేయడం వల్ల తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని రాజస్థాన్ కి చెందిన ఎలిజా గుప్తా అనే మహిళా జడ్జీ ఆరోపించారు. చట్టప్రకారం తన పని తాను చేశానని.. అంతమాత్రాన తనపై కక్ష్య కట్టి తన ఉద్యోగం పోయేవరకు తీసుకువచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. సమాజంలో ఇలాంటి వారు ఉండటం వల్ల ఎంతోమంది అన్యాయాలకు బలి అవుతున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు.

తనని వేధించిన నింధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక న్యాయమూర్తినైనా తనకు అన్యాయం జరిగింది.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్యాల్ కు లేఖ రాశారు ఎలిజా గుప్తా. సీజేఐకి లేఖ రాసిన యూపీ జడ్జీని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా తనకు న్యాయం కావాలని లేఖ రాసినట్లు ఎలిజా గుప్తా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎలిజా గుప్తా ఆరోపణలు నాగౌర్ కు చెందిన పలువురు లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, కొంతమందికి ఫేవర్ గా తీర్పులు ఇస్తుందని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments