iDreamPost
android-app
ios-app

Dwaraka:శ్రీకృష్ణుని భక్తులకు శుభవార్త! త్వరలో సముద్రంలోని ద్వారకకు సబ్‌మరైన్!

  • Published Dec 30, 2023 | 6:32 PM Updated Updated Dec 30, 2023 | 6:32 PM

పురాతన కట్టడాలు, ఆలయాలను ఎంతో మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. పైగా వాటికీ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. కానీ, కొన్ని ఆలయాలు ఎంత ప్రసిద్ధి గాంచిన కాల క్రమేణ కనుమరుగైపోయాయి. ఈ క్రమంలో ఇలా కనుమరుగైపోయి సముద్రంలో కలిసిపోయిన.. ఓ ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

పురాతన కట్టడాలు, ఆలయాలను ఎంతో మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. పైగా వాటికీ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. కానీ, కొన్ని ఆలయాలు ఎంత ప్రసిద్ధి గాంచిన కాల క్రమేణ కనుమరుగైపోయాయి. ఈ క్రమంలో ఇలా కనుమరుగైపోయి సముద్రంలో కలిసిపోయిన.. ఓ ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

  • Published Dec 30, 2023 | 6:32 PMUpdated Dec 30, 2023 | 6:32 PM
Dwaraka:శ్రీకృష్ణుని భక్తులకు శుభవార్త! త్వరలో సముద్రంలోని ద్వారకకు సబ్‌మరైన్!

ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక..ఈ మహానగరం ఎంతో ప్రసిద్ధి గాంచినది. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు విశ్వ కర్మ సహాయంతో ఈ నగరాన్ని నిర్మించాడు. అయితే, కాల క్రమేణ ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది అరేబియన్ మహా సముద్రంలో దాగి ఉంది. దీని గురించి ఇప్పటివరకు ఎంతో మంది రీసెర్చ్ కూడా చేశారు. అయితే, ఈ కనుమరుగైపోయిన పురాతన కట్టడానికి మరల పూర్వ వైభవం అందించడానికి.. శ్రీ కృష్ణుని భక్తులు, పర్యాటకులు అందరూ దీనిని వీక్షించేలా.. గుజరాత్ ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ విషయమై తాజాగా ఓ ప్రకటనను కూడా చేసింది.

కాగా, ఈ ద్వారక నగరం అరేబియన్ సముద్ర గర్భంలో దాదాపు 300 అడుగుల లోతున ఉంది. దీనిని ఎవరైనా వీక్షించాలంటే సబ్‌మెరైన్‌ మార్గం ఒకటే దారి. కాబట్టి ఆ ఆలయాన్ని వీక్షించేలా సబ్‌మెరైన్‌ సర్వీస్ ను మొదలుపెట్టడానికి.. గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ నౌకా సంస్థ మజ్‌గావ్ డాక్‌తో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే , ఈ సబ్‌మెరైన్‌లో ఒకసారి కేవలం 24 మంది మాత్రమే ప్రయాణించగలరు. వారితో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉంటారు. దీని వలన సముద్రం లోపల ఉన్న ద్వారక నగరాన్ని వీక్షించడంతో పాటు.. వింత సముద్ర జీవులను కూడా పర్యాటకులు వీక్షించే అవకాశం ఉంటుంది. దీనితో ఇటువంటి ఓ పురాతన కట్టడాన్ని చూసేందుకు అవకాశం లభిస్తున్నందుకు భక్తులు ఎంతో ఆనందిస్తున్నారు.

అయితే, మన దేశంలో ఇటువంటి సేవలను ఇప్పటివరకు ఎక్కడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే తొలి సబ్‌మెరైన్ టూర్‌గా అధికారులు తెలియాజేశారు. పర్యాటకులు ఈ సబ్‌మెరైన్ ద్వారా సముద్రం లోపల ఉన్న ద్వారక నగరాన్ని చూసి రావడానికి.. మొత్తంగా రెండు గంటల సమయం పడుతుందని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది. ఇక కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ పురాతన కట్టడాన్ని వీక్షించాలని.. ఎంతో మంది భక్తులు వేచి ఉన్నారు. ఏదేమైనా, ఈ ప్రాజెక్ట్ కనుక మంచి ఫలితాన్ని సాధిస్తే ద్వారకకు పూర్వ వైభవం తిరిగి రావడం కాయం. మరి, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.