iDreamPost
android-app
ios-app

వీడియో: నదులను తలపిస్తున్న వీధులు.. ఎటు చూసినా నీరే!

వీడియో: నదులను తలపిస్తున్న వీధులు.. ఎటు చూసినా నీరే!

ఉత్తర భారత దేశంలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీటితో ఆ ప్రాంతాల్లోని వీధులు మొత్తం నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి కూడా నీరు రావటంతో తినడానికి, తాగడానికి కూడా కష్టమైంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక బృందాలు జలమయం అయిన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి.

 ఇక, గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లోని వీధులు మొత్తం వరద నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాలు నీళ్లలో తేలుతూ పడవల్లా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో వర్ష భీభత్సానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ధోరాజీ ప్రాంతానికి సంబంధించిన ఓ వీడియోలో.. వీధులన్నీ వరద నీటితో నిండి ఉన్నాయి. ఆ నీటిలో పెద్ద సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు తేలుతూ ఉన్నాయి. వాటిని చూస్తుంటే.. నీటిపై పడవల్లా ఉన్నాయి.

జనం ఆ నీటిలోనే అటు, ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో గత కొన్ని గంటల్లో దాదాపు 300 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైనట్లు తెలుస్తోంది.
స్టేట్‌ ఎమెర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకారం.. గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సూత్రపద తాలూకాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో 14 గంటల్లో దాదాపు 345 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. మరి, ఉత్తర భారత దేశంలో అలజడి సృష్టిస్తున్న భారీ వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.