iDreamPost
android-app
ios-app

సహజీవనానికి ప్రభుత్వం షరతు.. అలా చేయకపోతే జైలుకే!

  • Published Feb 07, 2024 | 10:03 PM Updated Updated Feb 07, 2024 | 10:03 PM

భారత్ లో కొంతకాలంగా పాశ్చాత్య సంస్కృతి విస్తృతంగా వ్యాపిస్తుంది. చాలా వరకు యువత సహజీవనం వైపే మొగ్గు చూపిస్తున్నారు.

భారత్ లో కొంతకాలంగా పాశ్చాత్య సంస్కృతి విస్తృతంగా వ్యాపిస్తుంది. చాలా వరకు యువత సహజీవనం వైపే మొగ్గు చూపిస్తున్నారు.

  • Published Feb 07, 2024 | 10:03 PMUpdated Feb 07, 2024 | 10:03 PM
సహజీవనానికి ప్రభుత్వం షరతు.. అలా చేయకపోతే జైలుకే!

దేశంలో ప్రస్తుతం యువత ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు పోతుంది. కట్టుకునే బట్టల నుంచి జీవన విధానం వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. యువతీ యువకులు వివాహ వ్యవస్థపై ఆసక్తి చూపించడం లేదు.. చాలా వరకు లి సహజీవనం (లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌) వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బంధంతో తమకు నచ్చిన వారితో నచ్చినట్లు ఉండవొచ్చు. అందుకే తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం లెక్కచేయకుండా డేటింగ్ ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ఈ కల్చర్ వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని అంటున్నారు. మన భారత దేశ సంస్కృతి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో యువతలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం సహజీవనంపై కీలక నిబంధనలు తీసుకువచ్చింది. ఇంతకీ ఏ ప్రభుత్వం.. ఏంటా నిబంధనలు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సహజీవనం చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునేవారు, కాలేజ్ స్టూడెంట్స్, తల్లిదండ్రులకు దూరంగా ఉండే వారు తమకు నచ్చిన వాళ్లతో లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ లో ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ ఉంటున్నవారి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఒకరినొకరు చంపుకునే స్థాకియి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే సహజీవనం విధానంపై ఉత్తరాఖండ్ కొన్ని కీలక నిబంధనలు తీసుకువచ్చింది. మంగళవారం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసెంబ్లీలో పుష్కర్ సింగ్ ధామ్ సర్కార్ ప్రవేశ పెట్టారు. స్వతంత్ర భారత దేశంలో ఈ బిల్లు ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా రికార్డుకెక్కింది. ఈ బిల్లును చట్టంగా మార్చే పనిలో పడంది. ఈ బిల్లులో కీలక అంశాలను పొందుపరిచారు.

ఈ బిల్లు ప్రకారం.. ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నారో… సహజీవనం చేయాలనే యోచనలో ఉన్నారో వాళ్లు తమ రిలేషన్ ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయలనుకునే వారి వయసు 21 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల అనుమతి తప్పకుండా ఉండాలి. ఈ నిబంధనలను పాటించని యెడల తీవ్ర పరిణామాలు తప్పవని బిల్లు హెచ్చరించింది. నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25 వేలు జరిమానా కట్టాలి. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు కూడా అమలు అయ్యే అవకాశం ఉంటుందని యూసీసీ బిల్లులో పేర్కొన్నారు. ఇలా రిజిష్టర్ చేసుకోవడం వల్ల భద్రత ఉంటుందని.. సహజీవనంలో మనస్పర్ధలు వస్తే.. పార్ట్నర్ నుంచి విడిపోతే., తనకు అన్యాయం జరిగినట్లు భావిస్తే సదరు మహిళలు కోర్టును ఆశ్రయించవొచ్చు. భరణం క్లయిమ్ చేయడానికి అర్హత ఉంటుంది. ఈ జంటకు పిల్లలు పుడితే..చట్టబద్దంగా పరిగణించబడతారు అని బిల్లు చెబుతుంది.