iDreamPost
android-app
ios-app

దేశంలోని మైనారిటీ సంస్థలపై దర్యాప్తు! ఊహించని నిజాలు వెలుగులోకి!

దేశంలోని మైనారిటీ సంస్థలపై దర్యాప్తు! ఊహించని నిజాలు వెలుగులోకి!

దేశ వ్యాప్తంగా ఉన్న 1,572 మైనారిటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ జరిగిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్కాలర్‌షిప్‌లకు అవకాశం ఉన్న మైనారిటీ సంస్థలపై దర్యాప్తు జరిపింది. స్కాలర్‌షిప్‌లకు అవకాశం ఉన్న ఈ మొత్తం మైనారిటీ సంస్థల్లో 80 శాతం కార్యాకలాపాలు నిర్వహించని లేదా ఫేక్‌వని తేలింది. 1,572 సంస్థల్లో 830 సంస్థలు అలాంటి వేనని ఎన్సీఏఈఆర్‌ గుర్తించింది. సదరు కేంద్ర ప్రభుత్వ సంస్థ దాదాపు సంవత్సరానికిపైగా మైనారిటీ స్కాలర్‌షిప్‌లపై దర్యాప్తు చేసింది.

ఆగస్టు 2022న ఈ దర్యాప్తును ప్రారంభించింది. జులై నెలలో ఈ దర్యాప్తు పూర్తయింది. జులై 10న నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ తన దర్యాప్తులో తేలిన విషయాల తాలూకా నివేదికను దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించింది. పేద మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి దాదాపు 140 కోట్ల స్కామ్‌ జరిగినట్లు ఎన్సీఏఈఆర్‌ తమ నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 1,572 సంస్థలు దాదాపు 1.8 లక్షల స్కాలర్‌షిప్‌లు తీసుకుంటున్నాయని వెల్లడించింది.

ఈ స్కాలర్‌షిప్‌లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ 2020లో దేశ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయని వివరించింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేశామని తెలిపింది. ఛత్తీష్‌ఘర్‌లో 62 సంస్థలు, రాజస్తాన్‌లో 99,అస్సాంలో 68, కర్నాటకలో 64, ఉత్తరాఖండ్‌లో 60, ఉత్తర ప్రదేశ్లో 44, మధ్య ప్రదేశ్‌లో 40, వెస్ట్‌ బెంగాల్‌లో 39 సంస్థలు కార్యాకలాపాలు నిర్వహించని లేదా ఫేక్‌వని తేలినట్లు పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ దీనిపై దర్యాప్తు చేస్తోంది. మరి, దేశ వ్యాప్తంగా ఉన్న 1,572 మైనారిటీ సంస్థల్లో 830 సంస్థలు ఫేక్‌వని తేలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.