P Krishna
సంక్రాంతి వచ్చిందంటే.. పేద, ధనిక అనే తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోతుంటారు. వారం రోజుల నుంచి పండుగ సందడి మొదలవుతుంది.. గ్రామాల్లో వివిధ రకాల పోటీలు ప్రారంభం అవుతుంటాయి.
సంక్రాంతి వచ్చిందంటే.. పేద, ధనిక అనే తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోతుంటారు. వారం రోజుల నుంచి పండుగ సందడి మొదలవుతుంది.. గ్రామాల్లో వివిధ రకాల పోటీలు ప్రారంభం అవుతుంటాయి.
P Krishna
దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ఎక్కడ ఉన్నా ఈ పండుగకు తమ స్వస్థలాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, పతంగులు గుర్తుకు వస్తాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా బంధుమిత్ర సపరివారంతో ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి పండగు సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, జల్లి కట్టు క్రీడ ఎంతో కోలాహంగా ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతి పండుగ గిఫ్ట్ గా అర్హులైన వారికి రూ.1000 గిఫ్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఇంతకీ ఏ ప్రభుత్వం.. ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ సారి సంక్రాంతి పండుగ కానుకగా రూ.1000 లు రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తున్నట్లు సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు ఈ కానుక అందించబోతున్నట్లు తెలిపారు. ఇటీవల వరదల కారణంగా ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారని.. వారికి ఈ సాయం కొంత వకు ఊరట ఇస్తుందని ఆయన అన్నారు. పండుగకు ముందు రేషన్ దుకాణాల ద్వారా వెయ్యి రూపాయల నగదు సంక్రాంతి గిఫ్ట్ గా అందజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కం టాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారికి, తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఈ కానుక వర్తించదు.
ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి కానుక గిఫ్ట్ లో భాగంగా చెరుతో పాటు ఒక కేజీ బియ్యం, పంచదార కూడా ఉంటుందని తెలిపారు. గిఫ్ట్ హ్యాంపర్ తో పాటుగా దోతీ, చీర కూడా ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ‘కలైంజర్ మగళిర్ ఉరిమాయి తిట్టం’ అనే పథకం కింద ఇచ్చే వెయ్యి రూపాయలు పండుగకు ఐదు రోజుల ముందు జనవరి 10 వ తేదీన చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం వల్ల 1.15 కోట్ల మంది మహిళకు నేరుగా లబ్ది చేకూరుతుంది.