iDreamPost
android-app
ios-app

2500 లోన్ యాప్స్ తొలగింపు..కేంద్రం కీలక ప్రకటన!

Google: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. 2500 లోన్ యాప్స్ తొలగింపుపై ఆమె కీలక విషయాలను వెల్లడించారు.

Google: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. 2500 లోన్ యాప్స్ తొలగింపుపై ఆమె కీలక విషయాలను వెల్లడించారు.

2500 లోన్ యాప్స్ తొలగింపు..కేంద్రం కీలక ప్రకటన!

ప్రస్తుతం  స్మార్ట్ ఫోన్ యూజర్స్ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. కొత్త యాప్ లు అందుబాటులోకి రావడంతో..  ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సులభంగా అందుతున్నాయి. షాపింగ్, ఫుడ్, బ్యాంకింగ్, లోన్ ఇలా అన్నీ  అరచేతిలోకే అందుబాటులోకి వచ్చేశాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది యాప్స్ ద్వారానే లోన్స్ తీసుకోవడం ప్రారంభించారు. అంతేకాక ఆ యాప్స్ ద్వారా మోసపోయి తమ ప్రాణాలను తీసుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రజలు  ఇలాంటి ఫేక్ లోన్ యాప్స్ బారిన పడకుండా.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయమై సోమవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.

2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య కాలంలో… గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2500 ఫేక్ లోన్ యాప్స్ ను తొలగించింది. ఈ విషయమై డిసెంబర్ 18న లోక్ సభలో తలెత్తిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లిఖిత పూర్వక  సమాధానం ఇచ్చారు. ఫేక్ లోన్ యాప్స్ మీద ఎప్పటికపుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా  కలిసి పని చేస్తుందని.. సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా ఆర్థిక మంత్రి అధ్యక్షతలో ఉన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎఫ్ఎస్ డీసీ) సమావేశాలలో కూడా.. ఈ అంశం క్రమం తప్పకుండా చర్చించబడుతుందని పేర్కొన్నారు.

భారత  ఆర్థిక వ్యవస్థలో.. అటువంటి మోసాలను అరికట్టేలా  చర్యలు తీసుకోవడం దీని లక్ష్యం అని ఆమె చెప్పారు. అలాగే, ఈ విషయమై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించేందుకు  ప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులు అనేక చర్యలు  తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఫ్రాడ్ లోన్ యాప్ లను తొలగించేందుకు  తీసుకున్న చర్యలలో భాగంగా,ఆర్బీఐ ‘వైట్‌లిస్ట్’ భారత ప్రభుత్వంతో ఉన్న.. చట్టపరమైన యాప్‌లు, డాటాను  ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్  తో భాగస్వామ్యం చేసింది. కాబట్టి ఈ యాప్స్ అన్ని కూడా..  కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది.

కాగా,  గూగుల్ ప్లే  స్టోర్‌లో లోన్ లెండింగ్ యాప్‌ల అమలుకు సంబంధించి..  తన విధానాన్ని అప్‌డేట్ చేసింది.  ఇంకా, భారతదేశంలో రుణాలు ఇచ్చే యాప్‌ల కోసం కఠినమైన  చర్యలతో అదనపు పాలసీ అవసరాలను కూడా అమలు చేసిందని..  ఆమె జోడించారు. వారు  సవరించిన విధానం ప్రకారం, రెగ్యులేటెడ్ ఎంటిటీలు లేదా రెగ్యూలేటెడ్ ఎంటీటీ(ఆర్ఈ) లతో భాగస్వామ్యంతో పని చేసే వారి ద్వారా..  ప్రచురించబడిన యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో అనుమతించబడతాయి. ఏదేమైనా, టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూజర్స్ వినియోగదారీతనం  మోసగాళ్లకు అదునుగా మారింది. ముఖ్యంగా  లోన్ యాప్స్ వాడే వారి నుంచి సైబర్ నేరగాళ్లు అధిక వడ్డీ రాబట్టాలని చూస్తున్నారు. కాబట్టి, వినియోగదారులు  ఫేక్ యాప్స్ పట్ల అవగాహనా కలిగి ఉండడం మంచిది. మరి, నిర్మల సీతారామన్ పేర్కొన్న ఫ్రాడ్ యాప్స్ నిషేధంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.