భారతీయుడి దెబ్బకు వెనక్కి తగ్గిన గూగుల్.. ఇండియన్స్ కోసం కీలక ప్రకటన

Google Slashes 70% Prices Of Google Maps For API Indian Developers: ఇటీవల గూగుల్ కంపెనీకి ఒక భారతీయ వ్యాపారవేత్త చావు దెబ్బ కొట్టారు. దీంతో ఏటా గూగుల్ కి 100 కోట్లు నష్టం వాటిల్లనుంది. ఇది చాలదన్నట్టు ఆ భారతీయ వ్యాపారవేత్త మిగతా డెవలపర్స్ ని కూడా గూగుల్ కి బాయ్ బాయ్ చెప్పేసి స్వదేశీ టెక్నాలజీని వాడాలని పిలుపిచ్చారు. దీంతో ఇండియన్స్ చాలా వరకూ గూగుల్ కి టాటా చెప్పేసి స్వదేశీ టెక్నాలజీ వైపు అడుగులు వేశారు. ఈ దెబ్బతో గూగుల్ కంపెనీ దిగొచ్చింది.

Google Slashes 70% Prices Of Google Maps For API Indian Developers: ఇటీవల గూగుల్ కంపెనీకి ఒక భారతీయ వ్యాపారవేత్త చావు దెబ్బ కొట్టారు. దీంతో ఏటా గూగుల్ కి 100 కోట్లు నష్టం వాటిల్లనుంది. ఇది చాలదన్నట్టు ఆ భారతీయ వ్యాపారవేత్త మిగతా డెవలపర్స్ ని కూడా గూగుల్ కి బాయ్ బాయ్ చెప్పేసి స్వదేశీ టెక్నాలజీని వాడాలని పిలుపిచ్చారు. దీంతో ఇండియన్స్ చాలా వరకూ గూగుల్ కి టాటా చెప్పేసి స్వదేశీ టెక్నాలజీ వైపు అడుగులు వేశారు. ఈ దెబ్బతో గూగుల్ కంపెనీ దిగొచ్చింది.

భారతదేశం ఇదివరకటిలా లేదు. సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకునే స్థాయికి ఎదిగింది. పేరొందిన ప్రముఖ విదేశీ కంపెనీలలో చాలా వాటిలో భారతీయుల కృషి ఎంతగానో ఉంది. ఈ విషయం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఎప్పుడూ చెప్తుంటారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం భారతీయుల విషయంలో పెత్తనం చెలాయిస్తుంటాయి. మేమే తోపులం, మా మాటే శాసనం, మా మాటే వేదం అన్నట్టు ప్రవర్తిస్తుంటాయి. అలాంటి కంపెనీల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా ఉందనే వాదన కొంతమందిలో ఉంది. ఇటీవల గూగుల్ కంపెనీకి ఒక ఇండియన్ భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు గూగుల్ ఇప్పుడు దిగొచ్చింది. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా ఉన్న గూగుల్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. 

ఆ మధ్య ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. గూగుల్ మ్యాప్స్ కి గుడ్ బై చెప్పేసి క్యాబ్స్ లో ఓలా మ్యాప్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్ మ్యాప్స్ సర్వీసుల వల్ల ఓలా కంపెనీకి ప్రతి ఏటా వంద కోట్లు నష్టం వాటిల్లుతుందని.. ధరలు భారీగా ఉన్నాయని.. తగ్గించడం లేదని భవిష్ అగర్వాల్ గూగుల్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో గూగుల్ కి ఏటా వంద కోట్లు నష్టం వాటిల్లుతుంది. డెవలపర్స్ ని కూడా దేశీయ టెక్నాలజీపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఓలా మ్యాప్స్ సేవలను ఏడాది పాటు డెవలపర్లకి ఉచితంగా అందిస్తామని భవిష్ అగర్వాల్ గత వారమే ప్రకటించారు. దీంతో గూగుల్ కి గుబులు మొదలైంది. ఎక్కడ భారతీయ డెవలపర్స్ గూగుల్ మ్యాప్స్ కి గుడ్ బై చెప్పేసి ఓలా మ్యాప్స్ వైపు పురుగులు పెడతారో అని భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ధరలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 70 శాతం తగ్గిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇటీవల బెంగళూరులో డెవలపర్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో గూగుల్ ఐ/ఓ కనెక్ట్ లో ధరలను తగ్గిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

ప్రభుత్వ యాజమాన్యంలో ఓఎన్డీసీతో పని చేసే డెవలపర్స్ కి ఓపెన్ ఈ-కామర్స్ ను డెవలప్ చేయడంలో సహాయపడే గూగుల్ మ్యాప్స్ సేవల ధరలను 90 శాతం తగ్గిస్తామని గూగుల్ తెలిపింది. అంతేకాకుండా భారతీయ డెవలపర్స్ కోసం నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టడమే కాకుండా సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ ని కూడా భారత కరెన్సీలోనే చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. కాగా తగ్గించిన ఈ ధరలు ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఓలా మ్యాప్స్ పోటీని తట్టుకోవడానికే గూగుల్ ఇలా దిగొచ్చిందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గూగుల్ ధరలను తగ్గించడంపై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందించారు. ‘డియర్ గూగుల్.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. గూగుల్ మ్యాప్స్ ని వీడిన తర్వాత ధరలను తగ్గించారు.. రూపాయిల్లో ధరలను ఆఫర్ చేశారు. మీ నకిలీ దయ మాకు అవసరం లేదు. దీనికి ప్రతిస్పందనగా బ్లాగ్ లో ఓలా మ్యాప్స్ పై కీలక అప్డేట్స్ ఇస్తాను. వెయిట్ చేయండి’ అంటూ ఎక్స్ వేదికగా గూగుల్ కి చురకలు అంటించారు. కాగా భవిష్ ట్వీట్ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments