iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త!

Good News for Railway Passengers: నిన్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఏడవసారి 2024 వార్షిక బడ్జెట్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ బడ్జెట్ పేదల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు.

Good News for Railway Passengers: నిన్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఏడవసారి 2024 వార్షిక బడ్జెట్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ బడ్జెట్ పేదల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు.

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త!

భారత దేశంలో ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటి రైల్వే శాఖ. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణాలు చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే ప్రయాణం సురక్షితంగా భావిస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. టికెట్ ధర అందుబాటులో ఉంటుంది.. అన్నివసతులు ఉంటాయి. అందుకే రైలులో ప్రయాణం చేసేందుకు జనాలు మక్కువ చూపుతుంటారు. నిన్న పార్లమెంట్ లో 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఈ బడ్జట్ లో రైల్వే శాఖ కు రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందించారు. వివరాల్లోకి వెళితే..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర ప్రభుత్వం కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ లో రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో భద్రత కోసం రూ.1.08 లక్షల కోట్లను వినియోగిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇటీవల రైల్వే ప్రమాదాలు పెరిగిపోతున్న దృష్ట్యా పాత ట్రాక్స్ స్థానంలో కొత్త ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపర్చుతామన్నారు. అంతేకాదు ఫ్లై ఓవర్స్, అండర్ పాసెస్ నిర్మాణం, కవచ్ ఇన్‌స్టాలేషన్ కోసం నిధులు వెచ్చిస్తామని అన్నారు. కవచ్ 4.0 లో ఎంతో ముఖ్యమైన 4,275 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్, టెలికాం టవర్స్, RFID ట్రాక్ డివైస్, స్టేషన్ కవచ్, లోకో కవచ్ లను త్వరిత గతిలో ఇన్‌స్టాల్ చేస్తామని వెల్లడించారు.

డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్ లను తీసుకుంటామని.. మరో 10 వేల కోచ్ లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. వీటికి బడ్జెట్ లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్కో రైలు మూడింట రెండు వంతుల సాధారణ కోచ్ లు, ఒక వంతు ఏసీ కోచ్ లుగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. 2014 కు ముందు 60 ఏళ్లో కేవలం 20 వేల కిలోమీటర్ల రైల్వే రూట్ విద్యుదీకరణ ఉంటే.. గత పదేళ్లలో 40,000 కిలోమీటర్ల రైల్వే రూట్ ని విద్యుదీకరణ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి