బెంగుళూరులో నైట్ షిఫ్టులు చేసేవారికి అదిరిపోయే శుభవార్త! ఇకపై అర్థరాత్రి 1 గంట వరకు..

Bengaluru Nightlife: ప్రస్తుత కార్పోరేట్ ప్రపంచంలో చాలా మంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేయక తప్పడం లేదు. కొంతమంది తమ ఆర్థిక కష్టాలు తొలగించుకోవడానికి రాత్రి ఒక జాబ్, పగలు మరో జాబ్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్.

Bengaluru Nightlife: ప్రస్తుత కార్పోరేట్ ప్రపంచంలో చాలా మంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేయక తప్పడం లేదు. కొంతమంది తమ ఆర్థిక కష్టాలు తొలగించుకోవడానికి రాత్రి ఒక జాబ్, పగలు మరో జాబ్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్.

ఇటీవల చాలా మంది యువత ఎక్కువగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, మీడియా, ఫార్మా వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది.  మరికొంత మంది ఆర్థిక అవసరాలకు పగలు, రాత్రి జాబ్ చేయాల్సి వస్తుంది.  సాధారణంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవాకిరి పగలు ఉన్నన్ని సౌకర్యాలు రాత్రి సమయంలో ఉండవు. అందుకే చాలా మంది బయట ఎలాంటి ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉండాలని, రాత్రి కూడా వారు కోరుకున్న సౌకర్యాలను అందుబాటులో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీని వల్ల నైట్ షిఫ్ట్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు‌లో నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇకపై నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు ఇబ్బందులు పడకుండా నగరంలో బార్స్, షాప్స్, రెస్టారెంట్స్, హూటల్స్, లైసెన్స్ ఉన్న వ్యాపార సంస్థలన్నీ ఇకపై అర్థరాత్రి 1 గంట వరకు తమ కార్యాకలాపాలను కొనసాగించుకోవడానికి అనుమతినిచ్చింది. బృహత్ బెంగుళూరు మహనగర పాలిక (BBMP) పరిధిలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు ఈ అవకాశం ఉంది. జులై 29 డేట్ తో అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ఈ శుభవార్తకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఇకపై బెంగుళూరు పరిధిలో సీఎల్ 4 ( లైసెన్స్ క్లబ్), సీఎల్ 6 (ఏ) (లైసెన్స్ స్టార్ హూటల్), సీఎల్ 7 (లైసెన్స్ హూటల్ అండ్ బోర్డింగ్), సీఎల్ 7 డి (ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన హూటల్ అండ్ బోర్డింగ్ ఇచ్చే లైసెన్స్) ఈ లైసెన్స్ ఉన్న వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు తమ కార్యాకలాపాలను కొనసాగించుకోవచ్చు. కాకపోతే రాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యతు ఉంటుంది. ఇక సీఎల్ 9 (లైసెన్స్ ఉన్న రీ ఫ్రెష్ మెంట్ రూమ్ (బార్)) లు ఉన్న వ్యాపారులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు తమ వ్యాపారాలు కొనసాగించుకోవచ్చని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం వ్యాపారులకు వెసులుబాటు కల్పించింది. గతంలో ఫుడ్ స్టాల్స్, హూటల్స్, రెస్టారెంట్స్, బార్స్ రాత్రి 11 గంటల వరకే పరిమిషన్ ఉండేది. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఐటీ ఇతర ఉద్యోగ సంస్థల్లో చేసేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments