iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు ఇది కదా కావాల్సిది.. రూ. 1కే ఆటో రైడ్.. ఎక్కడంటే?

Flipkart offers auto rides for rs 1: ప్రయాణ చార్జీలతో విసిగిపోయారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 1కే ఆటో ప్రయాణం చేసే ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

Flipkart offers auto rides for rs 1: ప్రయాణ చార్జీలతో విసిగిపోయారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 1కే ఆటో ప్రయాణం చేసే ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ప్రయాణికులకు ఇది కదా కావాల్సిది.. రూ. 1కే ఆటో రైడ్.. ఎక్కడంటే?

ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛార్జీల మోత మోగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థల్లో అధిక ఛార్జీలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక పండగల సమయంలో వేరే చెప్పక్కర్లేదు. ఛార్జీలను అమాంతం పెంచి ముక్కుపిండి మరి వసూలు చేస్తుంటాయి. వేరే మార్గం లేక అడిగినంత ఇచ్చి ప్రయాణిస్తుంటారు. నగర ప్రాంతాల్లో ఆటో ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తక్కువ దూరానికి కూడా వందల్లో వసూల్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో చార్జీలు తగ్గితే బాగున్ను అని భావిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల కోసం క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది.

రూపాయికే ఆటోను బుక్ చేసుకుని వెళ్లొచ్చు. రూ. 1కే ప్రయాణం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? ఇది నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమేనండీ బాబు. ప్రముఖ ఈకామర్స్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. రూ. 1కే ఆటో రైడ్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ మనదగ్గర కాదండోయ్. బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. దీనికోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు వాసులు మాత్రమే ఈ ఆఫర్ ను యూజ్ చేసుకునే వీలుంది. రూ 1కే ఆటో ప్రయాణం అంటే.. ఇంతకు మించిన క్రేజీ ఆఫర్ మరోటి ఉండదనే చెప్పాలి.

రూపాయికే ఆటో రైడ్ కావడంతో ప్రయాణికుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పీక్ అవర్స్ లో రద్దీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ పలు ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసింది. రద్దీ సమయాల్లో రూ. 1కే రైడ్ లను అందిస్తోంది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, క్యాష్ లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఒక్క బెంగళూరు నగరంలోనే అందుబాటులో ఉండడంతో ఇతర ప్రాంతాల వారు ఉసూరుమంటున్నారు. తమ నగరాల్లో కూడా ప్రారంభించాలని ఫ్లిప్ కార్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రూ. 1కే ఆటో రైడ్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.