Union Budget 2024: బడ్జెట్‌లో పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధర

2024-25 వార్షిక సంవత్సరానికి గాను నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు గొప్ప శుభవార్త అందించారు.

2024-25 వార్షిక సంవత్సరానికి గాను నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు గొప్ప శుభవార్త అందించారు.

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ని నేడు ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాలు ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాలకు ఏ విధమైన ఉపశమనం కలుగుతుందో అని బడ్జెట్ సమావేశాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. బడ్జెట్ సమావేశంలో నిర్మల సీతారామన్ సామాన్యులకు ఉపశమనం కలిగించే పలు కీలక అంశాలను ప్రవేశ పెట్టారు.  ఇటీవల దేశ వ్యాప్తంగా పసిడి, వెండి ధరలు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి.  ఒకటీ రెండు రోజులు తగ్గితే మళ్లీ అమాంతం పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే మహిళలకు బంగారం లాంటి వార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పలు విషయాలు ఆమె బడ్జెట్ లో ప్రసంగించారు. ఇటీవల దేశంలో తరుచూ పసిడి, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి ధరలపై పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకదశలో సామాన్యులు బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పండుగలు,ఇతర శుభకార్యాల సీజన్ మొదలైంది.ఈ క్రమంలోనే మహిళలకు బంగారం లాంటి వార్త అందించారు నిర్మలా సీతారామన్. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర బడ్జెట్ లో భాగంగా సుంకం భారీగా తగ్గించారు.. ఈ సుంకం తగ్గించడం వల్ల దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలపై సుంకం తగ్గించడం వల్ల ధరలు దిగివచ్చే అవకాశం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఏడాదికి కనీసం 5 నుంచి 7వేల వరకు ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్ లో పసిడి తులం లక్షల రూపాలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం తులం రూ.70 వేల మార్క్ దాటిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్య తరగతి కుటుంబీకులు బంగారం కొనాలంటే ఆలోచనలో పడుతున్నారు. బంగారం ధరలు తగ్గితే.. కాస్త ఊరటనిచ్చే వార్త అంటున్నారు. అయితే ఎంత వరకు తగ్గుతుందో చూడాలి.

Show comments