Arjun Suravaram
మన దేశంలో ఎక్కువ మంది పశుపోషణ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంటాయి. తాజాగా ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మన దేశంలో ఎక్కువ మంది పశుపోషణ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంటాయి. తాజాగా ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
మనం దేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణ వంటివి చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక రైతులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్స్ తీసుకొచ్చాయి. కేవలం వ్యవసాయంపైనే కాకుండా పశుపోషణ విషయంలోనూ ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభించాయి. అలానే రైతుల పండించే పంటలు, ఇతర ఉత్పత్తుల విషయంలో తరచూ శుభవార్త చెబుతుంటాయి. తాజాగా పాల విషయంలో రైతులకు ఓ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దేశ వ్యాప్తంగా రైతులు పంట మద్దతు ధర, మరిన్ని డిమాండ్లతో ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ రహదారులపై ఆందోళన చేస్తున్నారు. రోడ్లపై వంటలు చేస్తూ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాల ధరను పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ రైతుల ఆందోళన నేపథ్యంలో ఎంఎస్పీ కి సంబంధించి కీలకమైన నిర్ణయమైన తీసుకుంది. పశువుల పెంచే రైతుల ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలోనే పాల ఎంఎస్‌పిని పెంచాలని హిమాచల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత రోజుల్లో పాల వ్యాపారానికి బాగా గిరాకీ ఉంది. చాలా మంది పాలు అమ్మి తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో పశుగ్రాసం, ఇతర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. దీంతో పాలకు సరైన ధర లభించకపోవడంతో ఆర్థికంగా చాలా సతమతవుతున్నారు. పశువుల రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం పాలపై కనీస మద్దతు ధరని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆవు పాలపై ఎంఎస్పీ లీటర్ కు రూ. 38 నుంచి రూ. 45కి పెంచింది. గేదె పాలపై రూ 38 నుంచి రూ. 55 కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వంమ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ కనీస మద్దతు ధరలు 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పశువుల పెంపకందారులు మాత్రమే పాలపై పెరిగిన ఎంఎస్పీ ప్రయోజనం పొందుతారు. మరి.. పాల విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.