Dharani
Subarnarekha Golden River: నదిలో నీళ్లు పారుతాయి అని తెలుసు కానీ.. బంగారం ప్రవహించడం గురించి ఎప్పుడైనా విన్నారా. కానీ మన దేశంలోని ఓ నదిలో బంగారం ప్రవహిస్తుంది. ఎక్కడంటే..
Subarnarekha Golden River: నదిలో నీళ్లు పారుతాయి అని తెలుసు కానీ.. బంగారం ప్రవహించడం గురించి ఎప్పుడైనా విన్నారా. కానీ మన దేశంలోని ఓ నదిలో బంగారం ప్రవహిస్తుంది. ఎక్కడంటే..
Dharani
ఈభూమి మీద మానవ జాతి అభివృద్ధికి ప్రధాన కారణం నీరు. చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకుంటే.. నీరు ఉన్న చోటనే నాగరికత వెల్లివిరిసింది. ఇక నీరు లేకపోతే.. ఎన్ని కష్టాలు పడాలో అందరికి తెలుసు. మన దేశంలో పంటలు, తాగు నీటికి ప్రధాన వనరులు నదులు. వీటిల్లో నీళ్లతో పాటు.. చేపలు, అమూల్యమైన ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇక కొన్ని చోట్ల గ్యాస్ నిలవలు కూడా ఉంటాయి. ఇక కొన్ని నదుల్లో ఎంతో విలక్షణమైన జీవజాలం కూడా ఉంటుంది. అయితే ఇవన్ని చాలా సాధారమైన విషయాలు. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే నది మాత్రం చాలా ప్రత్యేకం. ఈ నదిలో నీరు, చేపలు, ఇతర ఖనిజ సంపదతో పాటు.. ఎంతో అమూల్యమైన బంగారం కూడా లభిస్తుంది. పైగా ఈ గోల్డెన్ రివర్ ఉంది మన దేశంలోనే ఇంతకు ఈ నది ఎక్కడుంది అంటే..
మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. మరి ఇంతకు ఈ నది ఎక్కడ ప్రవహిస్తోంది.. దానిలో బంగారం ఎలా లభిస్తుంది అంటే.. అదే జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిమీ పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది తెలిసిన వార్తే. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం. ఈ నదిలో నీటి ద్వారా కొట్టుకు వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి.. వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడుతుంటారు. దాంతో ఈ నది పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నదిలో బంగారం ఎక్కడ నుంచి వస్తోందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యమే.
అయితే దీని గురించి కొందరు ఈ నది నీళ్లు బంగారంతో కూడిన రాళ్ల మీదుగా ప్రవహిస్తోంది కాబట్టే.. బంగారు రేణువులు నదిలో లభిస్తున్నాయిని చెబుతున్నారు. కానీ ఇంతవరకూ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది రహస్యంగానే మిగిలింది. దీన్ని చేధించేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం రెండు వేర్వేరు సంస్థలకు బాధ్యతలను అప్పగించింది. కానీ అవి ఈ నదిలో బంగారం ఆనవాళ్ల గురించి ఎలాంటి సమాచారం కనుగొనలేకపోయాయి. కాగా, వర్షాకాలం తప్పితే.. మిగిలిన అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతం ప్రజలు నదిలోని ఇసుకను జల్లెడపట్టి బంగారాన్ని వెలికితీస్తారు. వారికి దొరికే బంగారం బియ్యం, ధ్యానం కంటే చిన్నగా ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా.. ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు. ఇక్కడకు భారీగా తరలి వచ్చి.. బంగారం కోసం గాలిస్తుంటారు.