iDreamPost
android-app
ios-app

రౌడీల్లా రోడ్డుపైకి వచ్చి తన్నుకున్న అమ్మాయిలు.. ఇంత ముదిరిపోయారేంటి!

నేటికాలంలో కొందరు అమ్మాయిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అబ్బాయిల మాదిరిగానే గొడవలు పడుతూ దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు దాడి చేసుకున్నారు.

నేటికాలంలో కొందరు అమ్మాయిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అబ్బాయిల మాదిరిగానే గొడవలు పడుతూ దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు దాడి చేసుకున్నారు.

రౌడీల్లా రోడ్డుపైకి వచ్చి తన్నుకున్న అమ్మాయిలు.. ఇంత ముదిరిపోయారేంటి!

సాధారణంగా అందరూ అబ్బాయిలనే ఎక్కువగా నిందిస్తుంటారు. జూలాయిళ్లా తిరుగుతు, గొడవలు పడుతుంటారని. అంతేకాక ఏదైనా గొడవలు పడితే అందరూ ఏకమై మగపిల్లలపై ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. యువకులపై పబ్లిక్ చేసే కామెంట్స్ కూడా చాలా వరకు నిజమే ఉంటుంది. ఇదే సమయంలో ఆడపిల్లలపై ఎంతో మంచి అభిప్రాయం ఉంటుంది. వారు ఇంటి పట్టునే ఉంటూ, తల్లిదండ్రుల మాటలు వింటూ, చదువుల్లో ముందటారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం రౌడీల్లా ప్రవర్తిస్తూ..మిగిలిన వారికి అపకీర్తి తెస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కొందరు యువతలు రౌడీల్లా తన్నుకున్నారు. ఈ క్రమంలో బ్లేడ్ తో దాడి జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థినులలో ఒకరు తన లంచ్‌బాక్స్‌ను దాచిపెట్టారని మరొకరు ఆరోపించడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో వారి మధ్య వాగ్వవాదం జరిగి..చివరకు ఫలితంగా బ్లేడ్ దాడి వరకు వెళ్లింది. ఏప్రిల్ 30న ఢిల్లీలోని సర్వోదయ విద్యాలయంలో విద్యార్థినీల మధ్య గొడవ జరిగింది.  ఇద్దరు విద్యార్థినీల మధ్య భోజన విరామ సమయంలో లంచ్‌ బాక్స్ వివాదంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థినులలో ఒకరు తన లంచ్‌బాక్స్‌ను దాచిపెట్టారని మరొకరు ఆరోపించడంతో వాగ్వాదం మొదలైంది. చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివాన మాదిరిగా పెద్దదైంది.

ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థినీలు రోడ్డుపై ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ క్రమంలో ఒక విద్యార్థినీ విక్షణ కోల్పోయి బ్లేడుతో మరొకరి మరోక విద్యార్థినిపై దాడి చేసింది. బాధితురాలు 9వ తరగతి చదివినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటిపై పలు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియో కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో బాధితురాలి ముఖంలో రక్తం కారడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని స్కూల్ యాజమాన్యానికి పోలీసులు సూచించారు.

గతంలో కూడా కొందరు యువతులు రోడ్లపై తాగి రచ్చ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అలానే మరికొన్ని చోట్ల అయితే ఏకంగా పోలీసులతోనే వాగ్వాదం పెట్టుకున్నారు. ఇద్దరు యువతులు అయితే అబ్బాయి విషయంలో నడ్డి రోడ్డుపై పొట్టుపొట్టున కొట్టుకున్నారు.  ఇలా ఇటీవల కాలంలో కొందరు యువతలు రౌడీల్లా మారిపోయి ప్రవర్తిస్తున్నారు.  రోడ్లపై చిందులేస్తూ, నానాక రచ్చ చేస్తుంటారు. ఈ తరహా ఘటనలు చూసి.. ఇంత ముదిరిపోయారేంటిరా బాబు అంటూ పలువురు కామెంట్స్ సైతం చేశారు.  అయితే ఈసారి ఏకంగా పాఠశాల స్థాయిలో విద్యార్థినీలు గొడవ పడటం..తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది.