Venkateswarlu
Venkateswarlu
జీ20 సదస్సు 2023 కోసం భారత దేశం వేదిక అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి జీ20 సమావేశాలు న్యూఢిల్లీలో జరగనున్నాయి. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇందుకు వేదికకానుంది. సెప్టెంబర్ 9-10న ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాలకు సంబంధించిన దేశాధినేతలు, ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్‌తో సంబంధాలు ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బ్రిటన్ ప్రధాని రిషి శునక్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పగడ్భందీ ప్రణాళికలు రచింది. భద్రత విషయంలోనూ రాజీపడటం లేదు. అదే విధంగా వారికి ఇచ్చే అతిధి మర్యాదల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తగ్గేదేలా అంటోంది. దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లను చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అతిధులకు ఆహారాన్ని అందించే విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
అతిధులకు బంగారం, వెండి పాత్రల్లో ఆహారాన్ని వడ్డించనున్నారట. అయితే, అవి నిజంగా బంగారు, వెండివి కావు.. బంగారం, వెండి పూత పూసిన గ్లాసులు, ప్లేటులు ఇతర వస్తువుల్ని వాడనున్నారు. ఐటీసీ ఫుడ్స్ సంస్థ జీ20 సదస్సు క్యాటరింగ్ వ్యహహారాలను చూసుకోనుంది. రోడ్లపై దొరికి స్ట్రీట్ ఫుడ్ దగ్గరి నుంచి ఖరీదైన వంటకాల వరకు అన్ని రకాల ఆహార పదార్థాలను మెనూలో చేర్చారు. మరి, జీ20 సదస్సులో పాల్గొనే అతిధుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అద్భుతమైన ఏర్పాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.