Dharani
Dharani
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగితే.. ఎన్ని అనార్థాలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలో చోటు చేసుకునే నేరాల్లో సగానికి కారణం మద్యపానమే. ఈ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యపానం వల్ల సంభవించే నష్టాలు కళ్ల ఎదురుగా కనిపిస్తున్నా సరే.. ఈ దురలవాటును మార్చుకోరు చాలా మంది. ఒక్క పూట మందు తాగకపోయినా.. తట్టుకోలేరు చాలా మంది. అలాంటిది ఏకంగా ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అంటే.. మందు బాబుల నెత్తిన పిడుగు పడ్డట్టే. మరి ఇంతకు మద్యం దుకాణాలు ఇన్ని రోజులు పాటు ఎందుకు బంద్ చేస్తున్నారంటే..
ఇక ఐదు రోజులు వైన్స్ బంద్ అన్నది మన దగ్గర కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. హస్తినలో ఏకంగా ఐదు రోజుల పాటు మద్యం షాపులు మూతపడుతున్నాయి. మద్యం బాబులకు ఇది భారీ షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఈ నెలలో ఢిల్లీలో జీ-20 సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6-10 వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. సెప్టెంబర్ 9-10 వరకు ఢిల్లీ జీ-20 సమావేశం జరగనుంది. జీ20 సమ్మిట్ దృష్ట్యా ఢిల్లీలో సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ రెండు రోజులు ఢిల్లీలో అన్ని మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు, మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.
ఇక వరుసగా ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో.. గత రెండు రోజులుగా దేశ రాజధానిలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఐదు రోజుల పాటు వైన్స్ బంద్ అనడంతో.. జనాలు ముందు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తున్నారు. జీ-20 సమావేశం జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే హస్తినలో పలు ఆంక్షలు విధించారు. వారాంతాలు, సెలవుల కారణంగా గత వారం రోజులుగా మద్యం దుకాణాల వద్ద జనం రద్దీ పెరిగింది.