iDreamPost
android-app
ios-app

Union Budget 2024: బడ్జెట్-2024 ఎలా ఉండబోతుంది! తీపి కబురు ఎవరికి? చేదు వార్త ఎవరికి? పూర్తి స్టోరీ ఇదే!

Union Budget 2024: జూలై 23న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2024-25 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా ? లేక సంక్షేమానికి జై కొడుతుందా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Union Budget 2024: జూలై 23న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2024-25 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా ? లేక సంక్షేమానికి జై కొడుతుందా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Union Budget 2024: బడ్జెట్-2024 ఎలా ఉండబోతుంది! తీపి కబురు ఎవరికి? చేదు వార్త ఎవరికి?  పూర్తి స్టోరీ ఇదే!

ఇటీవలే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన సంగతి తెలిసింది. ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించగా..అలానే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్  మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.

జూలై 23వ తేదీన పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్  ఎలా ఉండబోతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఆర్థిక బడ్జెట్-2024లో ఎవరికి తీపి కబురు, ఎవరికి చేదు వార్త ఉండనుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలానే మిత్రపక్షాల అజెండాకు అనుగుణంగా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందా? ఈ ప్రశ్నకు బడ్జెట్‌ లోనే సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై ఆర్థిక నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కి సంబంధించి పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం…

ఇటీవల పార్లమెంట్-2024 ఎన్నికలు జరిగిన సంగతి తెలిసింది. ఆ సమయంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ ఓటాన్ అకౌంట్ త్వరలో ముగియనుండటంతో  ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడో సారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్నమొదటి బడ్జెట్ కావడంతో  అత్యంత ప్రాధాన్యంత సంతరించుకుంది. లోక్‌సభ-2024 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గిన క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర బడ్జెట్ 2024 సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23 మంగళవారం ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. లోక్‌సభలో మోదీ 3.0 ప్రభుత్వేం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.  ఇక ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ,  మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. తయారీ రంగంలో కొత్త కంపెనీల కోసం గతంలో ప్రకటించిన లాభదాయక  ట్యాక్స్ విధానాన్ని పొడిగించాలన్న డిమాండ్‌ గట్టిగా విన్పిస్తోంది. దీంతో  మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉపాధికల్పనపై బడ్జెట్‌లో ఎక్కువ ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులు వేయాలని యువత కోరుకుంటుంది. ఈ అంశాలపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయాపడుతున్నారు.

అలానే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఆయా ముడి సరకులపై భారీ సుంకాలు పెను భారంగా మారాయని వాదనలు వినిపిస్తోన్నాయి. దీంతో ముడి సరుకలు, పదార్ధాలపై పన్నులు తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 ఏళ్లకు పొడిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.

ఇదే సమయంలో పారిశ్రామిక రంగాన్నికి, ఆటోమెబైల్ రంగానికి ఊరట కల్పించే అవకాశం ఉంది. పునరుత్వాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వెహికల్, ఇతర గ్రీన్ సాంకేతికలతో ఇన్వెస్ట్ మెంట్ పెట్టే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం మీద వికసిత భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్న ఎన్డీయే ప్రభుత్వం అలాంటి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరి.. కేంద్ర ఆర్థిక బడ్జెట్-2024 గురించి పూర్తిగా తెలియాలంటే..రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి