iDreamPost
android-app
ios-app

తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్! విద్యార్థులంతా ఆ యూనివర్సిటీకి క్యూ!

Sandip University: విద్యను వ్యాపారంగా భావిస్తున్న ఈ రోజుల్లో సందీప్ యూనివర్సిటీ అతి తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తోంది. అలాగే ఫారన్ స్టూడెంట్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్, స్కాలర్ షిప్స్, నాణ్యమైన విద్య ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు.

Sandip University: విద్యను వ్యాపారంగా భావిస్తున్న ఈ రోజుల్లో సందీప్ యూనివర్సిటీ అతి తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తోంది. అలాగే ఫారన్ స్టూడెంట్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్, స్కాలర్ షిప్స్, నాణ్యమైన విద్య ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్! విద్యార్థులంతా ఆ యూనివర్సిటీకి క్యూ!

క్వాలిటీ ఎడ్యుకేషన్ ను పొదడం అనేది ప్రతి ఒక్క విద్యార్థి హక్కు. అయితే అందుకు ఎంత ఖర్చు పెట్టాలి? అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. విద్యను ఇప్పటికీ చాలామంది వ్యాపారంగానే చూస్తున్నారు. ఎల్కేజీకే ఏడాదికి రూ.లక్ష రూపాయలు అడుగుతున్నారు. మరి.. యూనివర్సిటీ విద్య అంటే ఎన్ని లక్షలు ఉండాలి? మధ్యతరగతి, అంతకంటే తక్కువ ఆర్థిక స్థితి ఉన్న చాలా కుటుంబాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగానే ఉంటోంది. ఇలాంటి రోజుల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ను అతి తక్కువ ధరలోనే అందిస్తున్నారు. అసలు ఆ యూనివర్సిటీ ఏది? ఎక్కడ ఉంది? అక్కడ విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

సందీప్ యూనివర్సిటీ:

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సందీప్ యూనివర్సిటీ గురించి. ఈ యూనివర్సిటీ మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. ఈ యూనివర్సిటీని సందీప్ ఎన్.ఝా స్థాపించారు. 2008లో కేవలం ఒక ఇంజినీరింగ్ కళాశాలగా మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి 2017లో ఒక సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీగా ఏర్పడింది. ఇప్పుడు 250 ఎకరాల్లో 20 లక్షల బిల్టప్ ఏరియాతో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అతి తక్కువ ధరలోనే సందీప్ ఝా అందిస్తున్నారు. ఈ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ, లా వంటి అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో దేశంలోని 17 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి ఆసియా దేశాల నుంచి విద్యార్థులు వచ్చి సందీప్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

స్కాలర్ షిప్స్:

ఈ సందీప్ యూనివర్సిటీలో ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. విద్యార్థులకు అధునాతన క్లాస్ రూమ్స్ ల్యాబ్స్, వర్క్ షాప్స్, సెంట్రల్ లైబ్రరీ, డిపార్టిమెంటల్ లైబ్రవరి వంటి అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ విద్యను భోదించే ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది పీహెచ్ డీ చేసిన వాళ్లే ఉండటం విశేషం. అలాగే ఇక్కడ ఫారన్ స్టూడెంట్స్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే సందీప్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కింద విదేశీ యూనివర్సిటీల్లో కూడా విద్యను అభ్యసించవచ్చు. అందుకోసం స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలాగే 95 శాతం, అంత కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్యను బోధిస్తారు. అలాగే 80 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం కూడా స్కాలర్ షిప్ ఉంటుంది. అలాగే క్యాంపస్ విద్యార్థులకు 100 శాతం ప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు.

తెలుగు విద్యార్థుల కోసం:

సందీప్ యూనివర్సిటీలో 2017 సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 25 మంది విద్యార్థుల వరకు ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థుల మీద స్పెషల్ కేర్ ఉంటుంది. యూనివర్సిటీలో సీసీ కెమెరాలు, సర్వే లైన్స్ ఉంటాయి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే తెలుగు విద్యార్థులకు ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు చేసి.. ఆంధ్రా నుంచే షెఫ్స్ ని కూడా తీసుకెళ్లి వంట చేయిస్తున్నారు. నాసిక్ దూరం కాబట్టి యూనివర్సిటీని చూడాలి అంటే కష్టం అని ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీరు పిల్లల కోసం అక్కడ పరిస్థితులను చూసేందుకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా మీరు ఫ్రీగా వెళ్లి క్యాంపస్ చూడచ్చు. భోజన వసతి కూడా ఉచితంగానే కల్పిస్తున్నారు. ఈ సందీప్ యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఫౌండర్ సందీప్ ఎన్.ఝా మాటల్లోనే విని తెలుసుకోండి.