iDreamPost
android-app
ios-app

అయోధ్య రాముడికి భారీ విరాళం ఇచ్చిన కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ

ఎన్నో ఏళ్లగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అయోధ్య లోని రామ మందిరం ఎట్టకేలకు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం ఆలయ కమిటీ పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలోనే నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఆలయ తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు.

ఎన్నో ఏళ్లగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అయోధ్య లోని రామ మందిరం ఎట్టకేలకు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం ఆలయ కమిటీ పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలోనే నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఆలయ తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు.

అయోధ్య రాముడికి భారీ విరాళం ఇచ్చిన కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ

హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు సమకూరుతున్నాయి. దేశవ్యాప్తంగా భక్తులు కూడా ఈ రామ మందిర నిర్మాణంలో విరాళం సమర్పించి భాగస్వామ్యం కావొచ్చని ఆలయ ట్రస్ట్ పేర్కొన్నారు. దీనితో భక్తులంతా నిర్మాణ క్రమంలో భాగస్వామ్యం కావాలని తమకు తోచినంత విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి.. తన యావత్ ఆస్తిని మొత్తం అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు.

దేశమంతా అయోధ్య రాముడి నామస్మరణతో ప్రతి ధ్వనిస్తోంది. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కల నేరవేరింది. మరికొన్ని రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం తిలకించడం కోసం కోట్లాది మంది హిందువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం అయోధ్య రామాలయం వైపు వేచి చూస్తోంది. అయితే రామ మందిర నిర్మాణం మొత్తం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆలయ నిర్మాణ కోసం అటూ హిందువులతో పాటు ముస్లింలు కూడా విరాళాలు అందిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు ,ప్రముఖులు కూడా ఆలయ నిర్మాణం కొరకు భారీగా విరాళం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ భారీ విరాళాన్ని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే..

కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ ఎస్ లక్ష్మీ నారాయణన్ తన జీవిత కాలం ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుతో పాటు, తన ఆస్తి మొత్తాన్ని అయోధ్య ట్రస్ట్‌కు దారాదత్తం చేశారు. అయితే నేరుగా డబ్బులు ఇవ్వకుండా బంగారం, వెండి, రాగి రూపంలో విరాళాన్ని రాముడికి సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే 151 కిలోల బరువు ఉన్న రామ్ చరిత్ మానస్‌ను తయారు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే దాన్ని తయారు చేయించడానికి ఆయన వద్ద ఉన్న స్థిరాస్తులు, అతను సంపాదించిన మొత్తం డబ్బును అయోధ్య రాముడికి అర్పించనున్నారు. అయితే లక్ష్మీ నారాయణన్ మొత్తం ఆస్తులు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే భారీ రామ్‌చరిత్‌మానస్‌ను ముద్రించి.. దాన్ని రామాలయ గర్భగుడిలో రామ్ లల్లా ముందు ఉంచనున్నట్లు తెలిపారు.

ఈ రామ మందిరంలో 10902 శ్లోకాలతో కూడిన రామ్‌చరిత్‌మానస్‌ పుస్తకాన్ని తయారు చేశారు. ఇందులో ప్రతి పేజీ రాగితో తయారు చేయబడి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రతీ పేజీని 24 క్యారెట్ల బంగారంలో ముంచి వాటిపై అక్షరాలు చెక్కనున్నట్లు తెలిపారు. దీని కోసం 140 కిలోల రాగి, 7 కిలోల బంగారం అవసరం అవుతుందని చెప్పారు. అయోధ్యను పర్యటించిన లక్ష్మీ నారాయణన్.. తాను కూడా రామ్‌చరిత్‌మానస్‌ను తయారు చేయించి దాన్ని రాముడి పాదాల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నుంచి అనుమతిని తీసుకున్నారు. ఈ క్రమంలోనే రామ్‌చరిత్‌మానస్‌ను ముద్రించేందుకు లక్ష్మీ నారాయణన్ తన ఆస్తులను అన్నింటినీ విక్రయించడంతోపాటు ఆయన బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు పొదుపు చేసిన మొత్తం డబ్బును ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీ నారాయణన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రిటైర్ అయిన తన సర్వీస్‌లో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి