కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలనే చికిత్స పొందుతూ.. ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తెలియపరిచారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఉమెన్ చాందీ ఏనాడు పార్టీ మారలేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ(79) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకొంత కాలంగా ఆయన గొంతు సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలనే ఆరోగ్యం క్షీణించి ఆయన తుదిశ్వాస విడిచారు. 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో ఉమెన్ చాందీ జన్మించారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా.. ఈ 12 సార్లు పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించడం విశేషం. రెండు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇదికూడా చదవండి: పాము కాటుకు గురైన ఆమంచి కృష్ణమోహన్.. ఆస్పత్రిలో చికిత్స!