iDreamPost
android-app
ios-app

తినడానికి రెస్టారెంట్‌కి వెళ్లి రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు.. అసలేం జరిగిందంటే

  • Published Mar 05, 2024 | 8:40 AM Updated Updated Mar 05, 2024 | 8:40 AM

సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఫుడ్ ను తినాలనుకున్న కొందరు కస్టమర్లకు ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న వెంటనే భయంకరమైన వాతవరణం నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..

సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఫుడ్ ను తినాలనుకున్న కొందరు కస్టమర్లకు ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న వెంటనే భయంకరమైన వాతవరణం నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Mar 05, 2024 | 8:40 AMUpdated Mar 05, 2024 | 8:40 AM
తినడానికి రెస్టారెంట్‌కి వెళ్లి రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు.. అసలేం జరిగిందంటే

ప్రస్తుతం కాలంలో చాలామంది బర్త్ డే లకు గానీ, వీకెండ్ కు కానీ, స్నేహితులతో, ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లి తినాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే మంచి రెస్టారెంట్ లకు వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టి ఫుల్ గా లాగిస్తుంటారు. కానీ, అలా వెళ్లిన వారిలో ఎంతోమందికి కొన్ని చేదు సంఘటనలు ఎదురవుతాయి. అందులో ముఖ్యంగా.. రెస్టారెంట్ లో ఫుడ్ బాగోకపోవడం కానీ, లేక తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవ్వడం వంటి సంఘటనలు ఎన్నో వింటున్నాం.ఇలా ఎంతోమంది రెస్టారెంట్ వారి నిర్లక్ష్యం వలన వారి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. కానీ, తాజాగా హర్యానా రాష్ట్రంలోని కొందరు కస్టమర్లు మాత్రం తినడానికి రెస్టారెంట కు వెళ్లి, రక్తపు వాంతులు చేసుకున్నారు. అసలు ఏం జరిగిదంటే..

సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఫుడ్ ను తినాలనుకున్న కొందరు కస్టమర్లకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కాగా, అక్కడికక్కడే రక్తపు వాంతులు చేసుకోవడంతో భయంకరమైన వాతావరణం నెలకొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో.. ఓ రెస్టారెంట్‌లోకి కొందరు కస్టమర్లు వెళ్లారు. అక్కడ వారు భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెషనర్ ను వినియోగించారు. అయితే ఆ మౌత్ ఫ్రెషనర్ వినియోగించిన కొన్ని సెకన్లలోనే వారికి నోరు మండిపోతున్నట్లు అనిపించింది. ఈ క్రమంలోనే..ఐదుగురు కస్టమర్లు రక్తపు వాంతులు చేసుకోవడం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అలా వాంతులు చేసుకున్న ఐదుగురు కస్టమర్లకు తక్షణమే వైద్య చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, అందులో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కస్టమర్లు వినియోగించే మౌత్ ఫ్రెషనర్‌లో హానికారక రసాయానాలు ఏమైనా కలిసివున్నయా, వాడారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఆ మౌత్ ఫ్రెషనర్‌లో ప్రాణాంతక యాసిడ్ ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారని సమాచారం తెలిసింది. అలాగే..  మౌత్ ఫ్రెషనర్‌లో ఉన్న కొన్ని ప్రాణాంతక పదార్థాల వల్లే భాదితులు ఇలా వాంతులు చేసుకున్నారని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బాధిత కస్టమర్లు వాంతులు చేసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి బటయకు ఊసే ప్రయత్నం చేస్తున్నట్లుగా  కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా  రెస్టారెంట్ కు వెళ్తే ఇలా ప్రాణాల మీదకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాాగా, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూనే, రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి, సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి ఇలా ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటన పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.