iDreamPost
android-app
ios-app

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్

  • Published Apr 25, 2024 | 3:02 PM Updated Updated Apr 25, 2024 | 3:06 PM

వేసవి కాలంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

వేసవి కాలంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచి మొదలైన ఎండలు ఏప్రీల్ లో ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఎక్కడ నీడ ఉంటే అక్కడికి వెళ్లి సేద తీరుతున్నారు. శీతల పానియాలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మాణుశ్యంగా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఉష్ణోగ్రతల వల్ల చాలా వరకు ప్లాస్టీక్, టింబర్ డిపోలు, బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఓ హూటల్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో ఉన్న జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళితే..

పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పాల్ హూటల్ లో అగ్రి ప్రమాదం సంభవించిందని అగ్ని మాపక దళానికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురికి  గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భవనం మొత్తం మంటలు, పొగతో చుట్టుముట్టింది.  పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పై కప్పుపై ఇద్దరు ఉద్యోగులు ఇరుక్కుపోయారు. ఫైర్ సిబ్బంది వారిద్దరిని ఎంతో రిస్క్ చేసి కాపాడారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. హూటల్ లో చిక్కుకున్న వారిని రక్షించారు.

అగ్ని మాపక శాఖ డీఐజీ మృత్యంజయ్ మాట్లాడుతూ.. పాల్ హూట్ లో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే వెంటనే ప్రమాద స్థలానికి వచ్చాం. హూటల్ గదుల్లో ఉన్న 25 మందిని   రక్షించారు. ఆ సమయంలో కొంతమందికి చిన్నచిన్న గాయాలు అయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించాం. అగ్ని మాపక సిబ్బంది ఎంతో రిస్క్ చేసి మంటలను అదుపు చేశారు. ఈదురు గాలులతో మంటలు ఎగసి పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామన్నారు.