రైలు ఏసీ కోచ్‌లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు!

Fire Train Bihar:రైలు ప్రయాణాలు అంటే ఎంతో సురక్షితం అని భావిస్తారు ప్రయాణికులు.. అందుకే సుదూర ప్రయాణాలు ఎక్కువగా రైల్లోనే చేస్తుంటారు. ఇటీవల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Fire Train Bihar:రైలు ప్రయాణాలు అంటే ఎంతో సురక్షితం అని భావిస్తారు ప్రయాణికులు.. అందుకే సుదూర ప్రయాణాలు ఎక్కువగా రైల్లోనే చేస్తుంటారు. ఇటీవల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటీవల దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎక్కువ సంఖల్యో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం ఎంతో సురక్షితంగా భావిస్తుంటారు. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు చూసి ప్రజలు భయపడే పరిస్తితి ఏర్పడింది గత ఏడాది ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు నిమిషాల వ్యవధిలో ప్రమాదానికి గురయ్యాయి. ఈ విషాద ఘటనలో 300 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా బీహార్ లోని లోకమాన్య తిలక్ స్పెషల్ రైల్ లో మంటలు రావడం తీవ్ర కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో రైల్లో మంటలు చెలరేగాయి. న్యూ ఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలో పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్ లో అర్థరాత్రి దానాపూర్ – లోకమాన్య తిలక్ స్పెషల్ 01410 రైలు లోని ఏసీ బోగిలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. అర్రాలోని కరిసాత్ హాల్ల్ లో ఈ సంఘటన జరిగింది. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో ట్రైన్ దిగి ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనపై అధికారులు ట్విట్టర్ వేధికగా స్పందించారు. ‘మార్చి 26న అర్రా జంక్షన్ కు సమీపంలో కరిసాత్ స్టేషన్ వద్ద ముంబై ఎల్‌టీటీ స్పెషల్ ఫేర్ ఎస్ఎఫ్ హూలీ స్పెషల్ లోని ఒక ఏసీ కోచ్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలు జరగలేదు’ అంటూ పోస్ట్ చేసింది.

ఈ సంఘటన తర్వాత యూపీ రైల్వే లైన్ లోని ఓహెచ్‌ఈ లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపించారు. బుధవారం ఉదయం ట్రాక్ క్లియర్ చేసిన తర్వాత నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్, పాట్నా ఎల్‌టీటీ ఎక్స్ ప్రెస్ వంట పలు రైళ్లను వాటి షెడ్యూల్ ప్రకారం రాకపోకలకు అనుమతించారు. అగ్ని ప్రమాదానికి గురైన కోచ్ ని అక్కడ నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే.. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారు. శుక్రవారం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ లో గోదాన్ ఎక్స్ ప్రెస్ లో రెండు బోగీలకు మంటలు రావడం ఆందోళన కలిగించింది. ఈ ఘటన మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకుంది.

Show comments