iDreamPost
android-app
ios-app

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌లో పొగ అలుముకుంది. భారీ పొగ కారణంగా జనం భయం గుప్పిట్లో అల్లాడిపోయారు. రైల్వే సిబ్బంది త్వరగా స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ముంబైనుంచి బెంగళూరుకు వచ్చింది. బెంగళూరు, మేజిస్టిక్‌లోని సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఆగి ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 7.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.

అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఎత్తున పొగలు రైల్వే స్టేషన్‌ను చుట్టు ముట్టాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో తెలీక అటు, ఇటు పరుగులు పెట్టారు. ఇక, రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అగ్ని మాపక సిబ్బందికి అందించారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ రైల్లో ప్రయాణికులు ఉండిఉన్నా పెద్ద ప్రమాదం జరిగేది. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

ఈ ప్రమాదంపై రైల్వే పోలీస్‌ అధికారి సౌమ్యలత మాట్లాడుతూ.. ‘‘ ఉద్యాన్‌ రైలు ఈ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ముంబై నుంచి బెంగళూరు వచ్చింది. రైల్వే స్టేషన్‌లో ఆగి ఉంది. దాదాపు 7.30 గంటల ప్రాంతంలో రైలు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది. ప్రమాదం జరిగినపుడు రైల్లో ఎవ్వరూ లేరు. ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు’’ అని తెలిపారు. మరి, ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.