ఘోర అగ్నిప్రమాదం.. శివుడి ఆలయంలో చెలరేగిన మంటలు!

Maharani Temple: అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెంతో మంది తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తుంటారు. తాజాగా ఓ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Maharani Temple: అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెంతో మంది తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తుంటారు. తాజాగా ఓ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు అనేవి చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఘటనలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. అలానే అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెంతో మంది తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తుంటారు. అలానే ఈ ఘటనల కారణంగా కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతుంది. అలానే తరచూ ఆలయాలు, ప్రార్థమన మందిరాల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ శివాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జమ్మూకాశ్మీర్ లోని గుల్ మార్గ్ ప్రాంతంలోని టూరిస్ట్ రిస్టార్ సమీపంలో కొండ ఉంది. ఆ గిరిపై ఉన్న ఓ శివాలయంలో బుధవారం తెల్లవారు జామున్న అగ్నిప్రమాదం జరిగింది. ఇదే విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదంలో శివాలయం పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.  గుల్ మార్గ్ ప్రాంతంలోని కొండపై ఉన్న శివాలయాన్ని మహారాణి ఆలయంగా పిలుస్తారు. ఆ గుడికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇది ఇలా ఉంటే బుధవారం ఈ ఆలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

మహారాణి ఆలయం అని కూడా పిలువబడే శివాలయంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మంటలు తీవ్రంగా అంటుకోవడంతో ఆలయాన్ని కాపాడలేకపోయారని అధికారులు తెలిపారు.  అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. “ఆప్ కి కసమ్”లోని హిట్ పాట ‘జై జై శివ్ శంకర్’తో సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సినిమా షూటింగ్స్ చేస్తుంటారు. అలా బాలీవుడ్ సినిమాల్లో ఈ ఆలయం కనిపించడంతో పర్యాటకులు ఎక్కువయ్యారు. అంతేకాక టూరిజం ప్లేస్ గా ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది.

అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్నికి ఆహుతైనా ఈ శివాలయంకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మహారాణి ఆలయాన్ని 1915లో మహారాజా హరి సింగ్ సతీమణి మోహినీ బాయి సిసోడియా నిర్మించారు. ఈ ఆలయం డోగ్రా రాజులకు చెందినది. ధర్మార్థ్ ట్రస్ట్ నియంత్రణలో ఉన్న దేవాలయాలలో ఈ గుడి ఒకటి. ఇది పూర్వపు రాజకుటుంబంచే నిర్వహించబడుతుంది. వివిధ మతాలు ఎలా కలిసి ఉండవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ.  ఒక ముస్లిం పూజారి ఇక్కడ పూజలు నిర్వహించడం. మొత్తంగా ఈ ఆలయంలో జరిగిన ప్రమాదం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments