వీడియో: ఆలయ వేడుకల్లో పేలిన బాణసంచా..150 మందికి తీవ్ర గాయాలు..!

Fire Accident: ప్రతి సంవత్సరం దీపావళి పండుగ నేపథ్యంలో పలు చోట్ల పేలుళ్ల ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా వరకు బాణసంచా తయారీ ఫ్యాక్టరీలు, క్రాకర్స్ విక్రయ దుకాణాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Fire Accident: ప్రతి సంవత్సరం దీపావళి పండుగ నేపథ్యంలో పలు చోట్ల పేలుళ్ల ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా వరకు బాణసంచా తయారీ ఫ్యాక్టరీలు, క్రాకర్స్ విక్రయ దుకాణాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ప్రతి ఏటా దీపావళి వచ్చిందంటే చాలు అనేక చోట్ల పేలుళ్ళ ఘటనలు చోటు చేసుకుంటాయి.  బాణాసంచా విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా..కొంతమంది డబ్బు కోసం వాటిని తుంగలో తొక్కేస్తున్నారు. అక్రమంగా క్రాకర్స్ తయారు చేస్తూ గోదాములు, దుకాణాల్లో నిల్వ చేస్తున్నారు. క్రాకర్స్ అమ్మేవారు భద్రతా నియమాలు పాటించడం లేదు. ఈ కారణం వల్లే  కొన్ని సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.   తాజాగా కేరళలోని కాసర్ గోడ్ లోని ఓ ఆలయంలో భారీ అగ్రి ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళాలోని ఆలయంలో బాణసంచా పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగడంతో 150 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగిందని అధికారులు చెబుతున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాక సిబ్బంది హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను కన్నూర్, కాసర్‌గఢ్, మంగళూరులోని వివిధ ఆస్పత్రులలో చేర్పించామన్నారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారుపోలీసులు. కాసర్ గోడ్ నీలేశ్వరం లోని అంజుట్టంబలం వీరార్ కాపు ఆలయంలో సోమవారం అర్థరాత్రి సమయంలో థేయంకట్ట మహూత్సవాన్ని చూసేందుకు ఆలయానికి పెద్దన భక్తులు తరలి వచ్చారు. వేడుకలు పురస్కరించుకొని బాణా సంచా కాల్చారు.

అదే సమయంలో పక్కనే ఉన్న గదుల్లో నిల్వ చేసి ఉన్న క్రాకర్స్ పై నిప్పురవ్వలు పడ్డాయి. అంతే ఒక్కసారిగా పేళుళ్లు సంభవించడంతో అక్కడ భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అప్పటికే పరిస్థితి విషమించింది.. పలువురిపై నిప్పులు పడటంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. మరికొంతమంది తొక్కిసలాటలో గాయపడ్డారు. బాణాసంచా పేలుడులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలుగ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగి, కొన్ని సెకన్ల తర్వాత ఆలయ ఉత్సవ వేదికకు వ్యాపించాయి. అయితే ఆలయ పరిసరాల్లో బాణాసంచా నిల్వ చేయడానికి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న థెయ్యమ్ ఉత్సవాలకు మహిళలు, చిన్నారుల సహా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. డప్పులు, వాయిద్యాలతో కోలాహలంగా ఉత్సవం జరుగుతున్న సయంలోనే ఊహించని విధంగా పేలుడు చోటు చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

Show comments