iDreamPost
android-app
ios-app

వీడియో: గుజరాత్ లోని హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం!

వీడియో: గుజరాత్ లోని హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం!

గుజరాత్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ లో శనివారం ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రైలు నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు, పోగలు చెలరేగాయి. దీంతో అధికారులు వెంటనే రైలు నిలిపివేశారు. ఇక ప్రయాణికులు అప్రమత్తమై ఆ రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు స్పందించి రైలులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా మరొక బోగిలోకి పంపించి మంటలు ఆర్పివేసే ప్రయత్నాలు చేశారు.

ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై పశ్చిమ రైల్వేకు చెందిన అధికారి CPRO సమిత్ మిశ్రా స్పందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బ్రేక్ వ్యాన్ కోచ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, దీంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా మరో బోగిలకు పంపించామని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి