iDreamPost
android-app
ios-app

రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య! ఎందుకో తెలుసా?

రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య! ఎందుకో తెలుసా?

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు బరితెగించి దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో కట్టుకున్న వాళ్లను సైతం కాటికి పంపుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భార్య ఏకంగా తాళికట్టిన భర్తను అతి దారుణంగా రోకలి బండతో కొట్టి చంపింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళ ఎందుకు భర్తను హత్య చేసింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో సత్తెమ్మ-నర్సింహా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త నర్సింహా మూగవాడు కావడం విశేషం. దీన్నే ఆసరాగా చేసుకున్న భార్య సత్తెమ్మ.. తరుచు మద్యం సేవించి ఇంటికి వచ్చేది. దీంతో మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవకు దిగేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఎప్పటిలాగే సత్తెమ్మ ఇటీవల కూడా మద్యం సేవించి ఇంటికొచ్చింది. వస్తూ వస్తూనే భర్త నర్సింహాతో గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సత్తెమ్మ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త నర్సింహాపై దాడికి దిగింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు సత్తెమ్మను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet