iDreamPost
android-app
ios-app

Air India: గాల్లో ఉండగానే విమానంలో ఇంజన్ లో మంటలు.. తర్వాత ఏమైందంటే..?

  • Published Dec 21, 2023 | 2:57 PM Updated Updated Dec 21, 2023 | 2:57 PM

ఈ మద్య విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ లోపాల వల్లనో ఇతర కారణాల వల్లనో గాల్లోనే ఉండగానే ప్రమాదాలకు గురవుతున్నాయి.

ఈ మద్య విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ లోపాల వల్లనో ఇతర కారణాల వల్లనో గాల్లోనే ఉండగానే ప్రమాదాలకు గురవుతున్నాయి.

Air India: గాల్లో ఉండగానే విమానంలో ఇంజన్ లో మంటలు.. తర్వాత ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో భూమిపైనే కాదు.. ఆకాశంలో కూడ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. టెకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు కొద్ది సేపట్లోనే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంజన్ లో మంటలు రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఈ ప్రమాదంలో కొన్నిసార్లు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అయితే పైలెట్లు ముందుగానే అప్రమత్తం కావడం వల్ల సురక్షితంగా ల్యాండింగ్ చేస్తూ వందల మంది ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. తాజాగా ఓ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఉన్నట్టుండి ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 814 ప్లెయిన్ ఢిల్లీ నుంచి ముంబాయికి బయలుదేరింది. ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే కొద్దిసేపటికి ముందు అకస్మాత్తుగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి. అప్పటికీ విమానం ఇంకా గాల్లోనే ఉంది. మంటలు చూసిన ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు గాల్లోనే కలిసి పోతాయా అని భయపడ్డారు. కానీ ప్రమాదాన్ని గమనించిన పైలెట్లు ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది రంగంలోకి దిగారు.

విమానాన్ని ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. అనంతరం జరిపిన తనిఖీల్లో ట్విస్ట్ వెలుగులతోకి వచ్చింది. అసలు ఇంజన్ లో మంటలు రాలేదని, పొగలు కూడా ఏమీ రాలేదని తేలిందని అంటున్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. గతంలో ఎయిర్ ఇండియా విమానాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాల కారణంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అటు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.