iDreamPost
android-app
ios-app

వీడియో: రైల్లో అధికారుల కళ్లు గప్పి ఈ యువతి ఎంతపని చేసిందంటే?

  • Published Aug 26, 2024 | 10:10 AM Updated Updated Aug 26, 2024 | 10:10 AM

Railway Police: ఇటీవల కొంతమంది ఈజీగా డబ్బు సంపాదించి లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు.. ఇందుకోసం ఎలాంటి మోసాలు, దారుణాలకైనా తెగబడుతున్నారు. ఓ యువతి రైల్ లో ప్యాసింజర్లను మోసం చేయాలని చూసింది.. తర్వాత ఏం జరిగిందంటే..

Railway Police: ఇటీవల కొంతమంది ఈజీగా డబ్బు సంపాదించి లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు.. ఇందుకోసం ఎలాంటి మోసాలు, దారుణాలకైనా తెగబడుతున్నారు. ఓ యువతి రైల్ లో ప్యాసింజర్లను మోసం చేయాలని చూసింది.. తర్వాత ఏం జరిగిందంటే..

  • Published Aug 26, 2024 | 10:10 AMUpdated Aug 26, 2024 | 10:10 AM
వీడియో: రైల్లో అధికారుల కళ్లు గప్పి ఈ యువతి ఎంతపని చేసిందంటే?

ప్రపంచంలో అతి పెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి భారతీయ రైల్వే. నిత్యం లక్షల మంది భారత రైల్వేలో తిరుగుతుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలకు చేయడానికి ఇష్టపడతారు. రైల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి కనుక సుదూర ప్రాంతాలకు దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్లకు రైలు ప్రయాణాలు చేయాలన్న సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రైలు ప్రయాణాలు చేసే సమయంలో రక రకాల మోసగాళ్లు ఎదురవుతుంటారు. రైల్వే శాఖ ఎప్పటికప్పుడు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అనౌన్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ యువతి అధికారుల కళ్లు గప్పి మోసానికి తెగించింది. వివరాల్లోకి వెళితే.

సాధారణంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు విజ్ఞప్తి.. దొంగలు ఉన్నారు జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోగలరు అంటూ అనౌన్స్‌మెంట్స్ వినిపిస్తూనే ఉంటుంది. కొంతమంది ప్రయాణికుల నిర్లక్ష్య వైఖరి దొంగలు పసిగట్టి వారిని దోచుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ ముఠా సరికొత్త రీతిలో దోపిడికి పాల్పపడుతూ రెడ్డ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఓ యువతి రైల్వే టీటీఈ అంటు చెప్పుకొని రైళ్లలో వసూళ్లకు పాల్పపడింది. అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫోన్ చేయడంతో అసలు గుట్టు రట్టయ్యింది. ఆమె అసలు టీటీఈ కాదని.. డబ్బుల కోసం అలా నటిస్తుందని పోలీసులు అరెస్టు చేశారు.

రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో అన్ని బోగీల్లో టీటీఈ తిరుగుతూ టికెట్లు చెక్ చేస్తుంటారు. టికెట్ లేని వారికి ఫైన్ విధించడం, పక్క స్టేషన్ లో దింపేయడం లాంటివి చేస్తుంటారు. అందుకే టికెట్ లేని వారు, జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేవారు టీటీఈని చూస్తే భయపడతారు.శుక్రవారం పాతాళకోట్ ఎక్స్ ప్రెస్‌లో ఓ యువతి ఘరానా మోసానికి తెగబడింది. ఎవరికీ అనుమానం రాకుండా గులాబీ రంగు కోట్, వైషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని టీటీఈలా బిల్డప్ ఇచ్చింది. కానీ, ఆ యువతి చేష్టలు చూసి ప్రయాణికులకు అనుమానం రావడంతో వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నకిటీ టీటీఈ గా తేల్చారు. ఈ సందర్భంగా నకిలీ టీటీఈ గా అవతారం ఎత్తి పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ యువతి టికెట్స్ లేని వారి వద్ద డబ్బులు వసూళ్లు చేసిందని.. ఆమెపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.