iDreamPost
android-app
ios-app

ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. పరుగులు తీసిన జనం

  • Published Sep 27, 2023 | 3:52 PM Updated Updated Sep 27, 2023 | 3:52 PM
ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. పరుగులు తీసిన జనం

ఈ మద్య కాలంలో రైలు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. వరుసగా ఎక్కడో అక్కడ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మద్య ఒడిశా బాలాసోర్ వద్ద మూడు రైళ్లు క్షణాల వ్యవధిలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ రైలు ప్రమాదం యావత్ దేశాన్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ట్రైన్ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ ఫ్లాట్ ఫాంపైకి దూసుకు వెళ్లింది. కాకపోతే అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. రైలు దూసుకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

రైలు ఫ్లాట్ ఫామ్ పైకి ఎలా దూసుకు వచ్చిందో తెలియలేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ రుపుతున్నట్లు చెప్పారు. రైలు షకూర్ బస్తీ నుంచి బయలుదేరిన ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైలు రాత్రి 10.49 గంటలకు మధుర స్టేషన్ కి వచ్చింది.. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. హఠాత్తుగా రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామం అని స్టేషన్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు.