ఎన్నికల సిబ్బందికి జీత భత్యాలు ఎంత చెల్లిస్తారు.. ఎవరిస్తారంటే..

Elections 2024: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది జీత భత్యాల వివరాలు మీ కోసం..

Elections 2024: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది జీత భత్యాల వివరాలు మీ కోసం..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో దశలో భాగంగా రేపు అనగా సోమవారం, మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎలక్షన్‌ నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైత షెడ్యూల్ వచ్చిన తర్వాత దేశంలోని వ్యవస్థలతోపాటు పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాల సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తుంటారు. కొందరు రోజు వారి విధుల్లో పాల్గొంటే మరికొందరు పోలింగ్, కౌంటింగ్ ఇతర ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇలా ఎన్నికల్లో విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రత్యేక జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి గాను.. ఇప్పటి వరకు ఇచ్చే రెమ్యూనిరేషన్ పై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి మార్చి 13నే ఆమోదం తెలిపింది.

దీని ప్రకారం.. ఈ ఏడాది ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారులు, సిబ్బందికి.. గత ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన వేతనాన్నే ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ క్రింది బాధ్యతల్లో ఉన్న వాళ్లు అందుకునే రెమ్యూనిరేషన్ ఇలా ఉంటుంది.

  • సెక్టార్​ ఆఫీసర్…..​ రూ. 5 వేలు
  • మాస్టర్​ ట్రైనర్…​ రూ. 2 వేలు
  • ప్రిసైడింగ్​ ఆఫీసర్​, కౌంటింగ్​ సూపర్​వైజర్​, రిసెప్షన్​ సూపర్​ వైజర్..​ రోజుకు రూ. 350
  • పోలింగ్ ఆఫీసర్‌, కౌంటింగ్ అసిస్టెంట్‌, రిసెప్షన్ అసిస్టెంట్‌…..రోజుకు 250 రూపాయలు
  • క్లాస్‌ IV, ఎంటీఎస్.. రోజుకు 200 రూపాయలు, ప్యాక్డ్ లంచ్‌ లేదా లైట్‌ రిఫ్రెష్‌మెంట్‌, రోజుకు 150 రూపాయలు
  • వీడియో సర్వేలైన టీం, వీడియో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, ఎక్సెపెండేచర్‌ మానిటరింగ్ కంట్రోల్‌ రూమ్‌ అండ్‌ కాల్ సెంటర్‌ స్టాఫ్‌, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్‌ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌, స్టాటస్టిక్‌ సర్వేలైన్స్‌ టీం, ఎక్స్‌పెండేచర్‌ మానిటరింగ్ సెల్‌ ….. క్లాస్‌ -i/iiకి 1,200 రూపాయలు,
  • క్లాస్‌-iii కి వెయ్యిరూపాయలు ,
  • క్లాస్‌-iv రోజుకు 200 రూపాయలు
  • మైక్రో అబ్జర్వర్స్‌.. 1000 రూపాయలు
  • అసిస్టెంట్‌ ఎక్స్‌పెండేచర్‌ అబర్వర్‌.. 7500 రూపాయలు
  • పోలింగ్‌ రోజున విధులకు నియమితులయ్యే పోలీసు సిబ్బందికి, మొబైల్‌ పార్టీ సిబ్బందికి, హోం గార్డులకు, ఫారెస్టు గార్డులకు, గ్రామ రక్షక దళం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు ప్యాక్ట్‌ లంచ్‌ లేదా రూ.150 నగదు చెల్లిస్తారు.
  • ఎన్నికల్లో పోలింగ్‌ విధులకు, ఓట్ల లెక్కంపు విధులకు నియమితులైన వారికి రెమ్యునరేషన్‌తో పాటు లంచ్‌కు రూ.150 చెల్లిస్తారు. అర్హత మేరకు డీఏ చెల్లిస్తారు.
Show comments