Arjun Suravaram
కూతురిపై తండ్రికి ఉండే ప్రేమ వెలకట్టలేనిది. అలానే తన బిడ్డకు ఏ కష్టం రాకుండూ చూసుకునేందుకు తండ్రి పరితపిస్తుంటాడు. బిడ్డ కళ్లలో ఆనందం చూసేందుకు.. తండ్రి ఎంతటి సాహసానికైన వెనుకాడదు. అలాంటి ఓ తండ్రి ప్రేమ కథ ఇది.
కూతురిపై తండ్రికి ఉండే ప్రేమ వెలకట్టలేనిది. అలానే తన బిడ్డకు ఏ కష్టం రాకుండూ చూసుకునేందుకు తండ్రి పరితపిస్తుంటాడు. బిడ్డ కళ్లలో ఆనందం చూసేందుకు.. తండ్రి ఎంతటి సాహసానికైన వెనుకాడదు. అలాంటి ఓ తండ్రి ప్రేమ కథ ఇది.
Arjun Suravaram
ఈ ప్రపంచంలో కూతురిపై తండ్రి చూపించిన అంత ప్రేమ మరెవ్వరు చూపించారు. ప్రతి తండ్రికి తన కుమార్తెను యువరాణిగా భావిస్తుంటాడు. అందుకే కూతుర్లను ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటారు. కుమార్తె కళ్లలో సంతోషం, పెద్దలపై చిరునవ్వును చెరకుండా చేసేందుకు ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడుతుంటాడు. ఇక బిడ్డ అడిగింది అంటే కొండమీద కోతిని అయిన తెచ్చేందుకు సాహసించే తండ్రులు ఎందరో అన్నారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా తన కుమార్తె అడిన కోరికను తీర్చేందుకు ఓ తండ్రి సాహసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడులోని పుదుకొట్టైకి చెందిన ఓ వృద్దుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ వృద్ధుడుకి కుమార్తె ఉంది. పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపిచాడు. ఇక ఆయన కుమార్తె తరచూ పండగలకు పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగకు కూడా కుమార్తె ఇంటికి వచ్చింది. అయితే తనకు చెరకు గడ తిన్నాలని ఉందని తండ్రితో చెప్పింది. దీంతో కుమార్తెపై ప్రేమతో ఆయన అవి తేవాలని చూశాడు. కానీ వారి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఆ చెరకు గడ్డలు లభించలేదు. అయితే తన బిడ్డ ఎంతో ప్రేమగా అడిగేసరికి.. ఆ తండ్రి హృదయం అల్లాడింది.
ఎలాగైనా చెరకు గడలు తీసుకొచ్చి..తన కుమార్తె కోరికను తీర్చాలని ఆ తండ్రి భావించాడు. అనుకున్నదే తడవుగా..సైకిల్ పై చెరకు గడలు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అలా పండ్లు, పూలు ఇతర వస్తువులు తీసుకున్న అనంతరం చెరకు గడలు తీసుకున్నాడు. కుమార్తె కోసం పొడవైన ఐదు చెరకు గడలను తలపై పెట్టుకుని ప్రయాణించాడు. అలా తలపై చెరకు గడలతో ఏకంగా 14 కిలోమీటర్లు ఆ వృద్ధుడు సైకిల్ తొక్కాడు. ఆ ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు అంటే.. ఆయన చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. అంతేకాక కూతురి కోసం ఆ వృద్ధుడు చేస్తున్న సాహసం చూసి.. తోటి వారు ఆయనను ఉత్సాహ పరిచారు.
Pudukkottai, Tamil Nadu: Elderly man Chelladurai, who carried a bunch of sugarcane on his head and rode for 14 kilometres for his daughter said, “His daughter Sundarapal did not have children for more than ten years after she got married. Her daughter gave birth to twins eight… pic.twitter.com/5WO1i6MnfI
— ANI (@ANI) January 14, 2024
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్నంటే ఇది కాదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ వచ్చిదంటే ఇంటిల్లి పాదీ సంతోషాలతో గడుపుతారు. చిన్న నాటి నుంచి పెంచుకున్న తన కుమార్తెకు ఇష్టమైన వాటిని సంక్రాంతికి తెచ్చి ఇచ్చేందుకు ప్రతి తండ్రి ఇష్టపడతాడు. అందుకు కష్టపడతాడు కూడా. ఆ కష్టంలో కన్న పేగు మీద ప్రేమ ఉంది. తండ్రి ప్రేమ కోసం కూతుళ్లు కూడా ఎప్పుడూ పరితపించి పోతుంటారు. అలానే ఈ వృద్ధుడు కూడా తన కుమార్తె పై ప్రేమతో ఈ సాహసం చేశారు మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.