P Krishna
Indians Released from Qatar: భారత దేశంలో కోసం ఎంతోమంది వీర జవాన్లు తమ ప్రాణాలు అర్పిస్తుంటారు. గూఢచర్యానికి పాల్పడ్డారనే నేపంతో విదేశాల్లో భారతీయులను అరెస్ట్ చేసి చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
Indians Released from Qatar: భారత దేశంలో కోసం ఎంతోమంది వీర జవాన్లు తమ ప్రాణాలు అర్పిస్తుంటారు. గూఢచర్యానికి పాల్పడ్డారనే నేపంతో విదేశాల్లో భారతీయులను అరెస్ట్ చేసి చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
P Krishna
సాధారణంగా విదేశాల్లో పనిచేసే భారతీయులను అక్కడి ప్రభుత్వాలు అన్యాయంగా కేసులు నమోదు చేసి జైల్లో పెడుతుంటారు. కొంతమందిని ఏకంగా గూఢచర్యానికి పాల్పపడ్డారని యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో భారత్ నౌకాదళంలో అధికారిగా పనిచేసి రిటైర్ అయిన కులభూషన్ జాదవ్ ని పాకిస్థాన్ గూఢచర్యం కేసు పెట్టి అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకొని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లగా.. అతనికి ఉరిశిక్ష నిలుపు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ మరోసారి తన దౌత్యంతో ఎనిమిది మంది భారతీయ సైనికుల ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళితే..
భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారులు ఎమినిది మంది ఖతార్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిపై అక్కడ ప్రభుత్వం గూఢచర్యం కేసు పెట్టి జైల్లో పెట్టారు. విచారణ జరిపిన తర్వాత కోర్టు ఎనిమిది మందికి ఉరిశిక్ష విధించింది. గత ఏడాది జరిగిన ఈ సంఘట దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఆ 8 మందిని భారత నౌకాదళ మాజీ అధికారుల కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి.. తమ వారిని ప్రాణాలతో తిరిగి తీసుకురావాలని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించారు. భారత్ జోక్యంతో ఎనిమిది మంది ఖైదీలకు మరణశిక్ష బదులు యావజ్జీవిత ఖైదులుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలు తమవారిని భారత్ కి సురక్షితంగా తీసుకురావాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే 8మంది నేవీ మాజీ అధికారులను ఖతార్ సోమవారం విడుదల చేసింది. ఎనిమిది మంది మాజీ అధికారుల్లో ఏడుగురు ఇప్పటికే భారత్ కి తిరిగి వచ్చినట్లు విదేశాంగ శాఖ సోమవారం ఓ అధికారిక ప్రకటన చేశారు. మరో అధికారి రావాల్సి ఉందని అధికారుల తెలిపారు.
2022 అక్టోబర్ లో ఏనిమిది మంది ఇండియన్ మాజీ నేవీ అధికారులను సబ్ – మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పపడ్డారని అక్కడి రహస్యాలను ఇజ్రాయేల్ సహ ఇతర దేశాలకు చేరవేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేసి మరణ శిక్ష విధించారు. అప్పటి నుంచి వాళ్లు జైల్లోనే ఉన్నారు. బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగి ఆ తీర్పుపై అప్పీలు దాఖలు చేసింది. డిసెంబర్ లో మరణశిక్ష రద్దు చేసి యావజ్జీవ ఖైదులుగా మార్చింది. ఆ శిక్ష కూడా రద్దు చేయాలని, వారు ఎటువంటి గుఢచర్యానికి పాల్పపడలేదని ఆధారాలతో సహా నిరుపితం కావడంతో 8 మంది భారతీయులను విడుదల చేశారు. భారత గడ్డపై అడుగు పెట్టిన వెంటనే ఎనిమిది మంది తమ వారిని బాగోగులు అడుగుతారని భావించారు. కానీ వారు ఎయిర్ పోర్ట్ లో తమ వారిని, అధికారులను చూసి ‘జై భారత్ మాతాకీ జై’ అంటూ గట్టిగా నినదించారు. ప్రాణాలు పోతున్నా.. భారత దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడు గుండె నిండా తమ వారికన్నా భరత మాత కొలువై ఉంటుందని అంటారు.. ఇది నిజమని మరోసారి ఎనిమిది మంది మాజీ సైనికులు నిరూపించారు.. భారత్ లో అడుగు పెట్టగానే మొదట దిక్కులు పిక్కటిల్లెలా భారత్ మాతాకీ జై.. అంటూ తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. భారత్ దౌత్యం ఫలించి ఎనిమిది మంది భారతీయులు స్వదేశానికి తిరిగిరావడంపై యావత్ భారత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.