iDreamPost
android-app
ios-app

ఓటు వేసేటప్పుడు సెల్పీ తీసుకుంటే ఇక అంతే..EC వార్నింగ్!

  • Published Nov 16, 2023 | 7:54 PM Updated Updated Nov 16, 2023 | 7:54 PM

ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే కొందరు అత్యుత్సాహాన్ని చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని కష్టాలు కొని తెచ్చుకుంటారు.

ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే కొందరు అత్యుత్సాహాన్ని చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని కష్టాలు కొని తెచ్చుకుంటారు.

  • Published Nov 16, 2023 | 7:54 PMUpdated Nov 16, 2023 | 7:54 PM
ఓటు వేసేటప్పుడు సెల్పీ తీసుకుంటే ఇక అంతే..EC వార్నింగ్!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లలోనే కాలం గడిపేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల కారణంగా ప్రస్తుతం సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. సినిమాకు, ఏదైనా టూర్, ఫంక్షన్లు… ఒకటేంటి.. ప్రతి విషయంలో చాలా మంది సెల్ఫీల దిగుతుంటారు. మరికొందరు అయితే ఇంట్లో ఉన్నా రోజుకో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయనిదే రోజు గడవదు. సమయం సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ దేనితో పడితే దానితో, ఎవరితో పడితో వారితో అయినా సెల్ఫీ దిగేందుకు సిద్ధమైపోతున్నారు. మరికొందరు యువత అయితే  ఓటింగ్ సందర్భంగాలో కూడా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అలాంటి వారికి ఎలక్షన్ కమిషన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖలతో, కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు సెల్ఫీ దిగితే పెద్దగా సమస్య ఉండదు. కారణం అలాంటివి నేటికాలంలో చాలా కామన్. కానీ కొందరు యువత మాత్రం హద్దులు దాటి మరీ సెల్పీలు దిగుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించేలా సెల్పీలను దిగుతున్నారు. ఎంత  దారుణం అంటే అత్యుత్సాహంతో ఓటు వేస్తూ మరీ సెల్ఫీలు దిగుతున్నారు. అంతేకాక తామేదో ఘనకార్యం చేసినం అన్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పలానా వారికి ఓటు వేశామని కూడా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఇలాంటి వారిపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌గా దృష్టిసారించింది.

గతంలో కొందరు యువత ఈవీఎం మిషన్‌ కనిపించేలా సెల్ఫీలు దిగుతూ పోస్ట్‌లు చేశారు. దీంతో ఇది ఇతర ఓటర్లను ప్రభావితం చేయడం… రహస్య బ్యాలెట్ విధానాన్ని ఉల్లంఘించినట్లు అవుతోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు  గట్టి హెచ్చరికలు ఇస్తున్నారు. ఇకపై ఎవరైనా పోలింగ్ బూత్ లో ఫోటో దిగితే వారి ఓటు హక్కును రద్దు చేస్తామని  వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వారు వేసిన ఓటును కూడా చెల్లదని స్పష్టం చేశారు. ఒకసారి ఓటు హక్కు రద్దు అయితే.. ఆ తర్వాత మళ్లీ ఓటు పొందడం చాలా కష్టమనే సంగతి అందరికి తెలిసిందే.

వీటన్నిటితో పాటు చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. ఎన్నికల విషయంలో పలు నిబంధనలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి వాటిల్లో పోలింగ్ బూత్‌లోకి స్మార్ట్ ఫోన్‌లను అనుమతి లేదు. అయితే కొందరు మాత్రం అధికారుల కళ్లుగప్పి దొంగ చాటుగా పోలింగ్ బూత్ లోపలికి ఫోన్లను తీసుకెళ్తుంటారు. ఓటు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎవరైన అత్యుత్సాహానికి పోయి సెల్ఫీలు దిగితే తగిన మూల్యం చెల్లించకతప్పదు. మరి.. ఈసీ ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomgrandpashabetgrandpashabetganobet