iDreamPost
android-app
ios-app

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం!రిక్టర్‌ స్కేలుపై 5.3 నమోదు!

  • Published Apr 05, 2024 | 10:56 AM Updated Updated Apr 05, 2024 | 10:56 AM

Earthquake in Himachal Pradesh: ఇటీవల దేశంలో పలు చోట్ల భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ భూకంపాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.

Earthquake in Himachal Pradesh: ఇటీవల దేశంలో పలు చోట్ల భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ భూకంపాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.

  • Published Apr 05, 2024 | 10:56 AMUpdated Apr 05, 2024 | 10:56 AM
హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం!రిక్టర్‌ స్కేలుపై 5.3 నమోదు!

ఈ మద్య కాలంలో పలు చోట్ల భూకంపాలు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. గత ఏడాది టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. 50 వేల మంది మృత్యువాత పడగా..వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. గత కొంతకాంగా భారత్, ఇండోనేషియా, పాకిస్థాన్, నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇక భారత్ లో అయితే ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, హిమా చల్ ప్రదేశ్ పరిసర, అస్సాం పరిసర ప్రాంతాల్లో భూకంపాలు ప్రజలను  భయాకంపితులను చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి.  తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ లో చంబాలో భూకంపం సంభవించింది.. అదే సమయంలో పంజాబ్, చండీగఢ్, చరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. ఉపరితలానిక 10 అడుగుల కిలోమీట్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని సెకండ్ల పాటు సంభవించిన భూకంపంలో హిమాచల్ ప్రదేశ్ లోని ఏ ప్రాంతంలోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో బయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని అంటున్నారు బాధితులు.

1905 లో ఇదేరోజున హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాల 8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.  ఈ భూకంపంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది.  అప్పట్లో ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  ఎస్సీఎస్ రికార్డుల ప్రకారం పశ్చిమ హిమాలయాల్లో జరిగిన ఈ విపత్తులో దాదాపు ఇరవై వేల మంది చనిపోయారు. ఏది ఏమైనా భూకంపం సంభవించగానే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వీధుల్లోకి పరుగులు పెడుతున్నారు బాధితులు.