iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు ఆఫీస్ బాయ్..నేడు కోట్ల విలువైన కంపెనీకి అధినేత!

ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, అతని గమ్యాన్ని చేరుకోకుండాన్ని ఎవరూ ఆపలేరు. అలా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ.. ఆఫీస్ బాయ్ నుంచి నేడు కోట్ల కంపెనీకి అధిపతిగా ఎదిగిన ఓ వ్యక్తి నేటి తరం యువతకు ఆదర్శం

ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, అతని గమ్యాన్ని చేరుకోకుండాన్ని ఎవరూ ఆపలేరు. అలా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ.. ఆఫీస్ బాయ్ నుంచి నేడు కోట్ల కంపెనీకి అధిపతిగా ఎదిగిన ఓ వ్యక్తి నేటి తరం యువతకు ఆదర్శం

ఒకప్పుడు ఆఫీస్ బాయ్..నేడు కోట్ల విలువైన కంపెనీకి అధినేత!

సమాజంలో ఎన్నో రకాల మనుషులు జీవిస్తుంటారు. అందులో కోట్లకు పడగలెత్తిన వారు ఉంటారు. కటిక పేదరికంలో ఉండే వారు ఉంటారు. కోట్ల  రూపాయల కంపెనీలకు అధినేతలుగా మారిన కొందరి జీవితం తెలుసుకుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. విజేతగా నిలవాలంటే.. తపన, కృషి, పట్టుదల ఉంటే సరిపోతుంది. అంతేకాక పట్టువిడవనీ విక్రమార్కుడిలా అనేక అవరోధాలను జయించి.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. అలాంటి వారి జాబితాలో ఎందరో యువకులు కూడా చేరారు. అలాగే ఆఫీస్ బాయ్ నుంచి కోట్ల రూపాయల కంపెనీకి అధిపతిగా మారిని ఓ యువకుడి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని బీడ్ గ్రామానికి చెందిన దాసాహెబ్ భగత్ పేద కుటుంబంలో జన్మించారు. అతడు 1994లో బీడ్ గ్రామంలో జన్మించారు. అతని కుటుంబం చెరకు తోటల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వారు. దీంతో భగత్ కూడా పొలం పనులు చేసేవాడు. అలానే  ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పదో తరగతిని పూర్తి చేశాడు. ఆ తరువాత  ఐటీఐ చదివేందుకు పూణే వెళ్లాడు. అక్కడ ఐటీఐ చదువుతూనే చిన్న చిన్న పనులు చేసే వాడు. ఆ చదువు పూర్తైన తరువాత ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసీస్ గెస్ట్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా పని చేశాడు.

అతిథులకు టీ, నీళ్లు అందించేవాడు. భగత్ రూ.9వేలకు ఈ ఉద్యోగం చేశాడు. ఏదైనా చేయాలనే తన కలను నెరవేర్చుకోవాలనే ఆలోచనను మాత్రం వదులుకోలేదు. పగలు ప్యూన్‌గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు శిక్షణా కేంద్రానికి వెళ్లేవాడు. ఇక యానిమేషన్ కోర్సు పూర్తయ్యాక ముంబైలో  జాబ్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగంతో పాటు సి++, పైథాన్‌లో కోర్సు చేశారు. ఇదే సమయంలో అతడిపై విధి చిన్న చూపు చూసింది.

డిజైన్, గ్రాఫిక్స్ కంపెనీతో పని చేస్తున్నప్పుడు, టెంప్లేట్‌ల లైబ్రరీలో పని చేయడం గొప్ప అవకాశామని గుర్తించాడు. అతను ఆన్‌లైన్‌లో డిజైన్ టెంప్లేట్‌లను అమ్మడం ప్రారంభించాడు. ఇలా సాగుతున్న సమయంలో ఓసారి భగత్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో అతడి ప్రణాళికలన్ని చిన్నాభిన్నమయ్యాయి. చాలా నెలలు మంచం మీద ఉన్నారు. అయితే  ఈ ప్రమాదం భగత్ లోని ధైర్యాన్ని, లక్ష్యాన్ని తగ్గించలేదు. మంచం మీద నుంచే డిజైన్‌లు,టెంప్లేట్లు తయారు చేయడం ప్రారంభించాడు. వీటిని విక్రయించడంతో జాబ్ లో వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదించాడు.

ఇక 2015లో నింత్‌మోషన్ అనే స్టార్టప్‌ని భగత్ ప్రారంభించాడు. అతి తక్కువ వ్యవధిలోనే 6 వేల మంది కస్టమర్‌లు అతనితో చేరారు. ఇక లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. గ్రామంలోని గోశాలలో టెంపరరీ ఆఫీస్ ను ఏర్పాటు చేశాడు. అతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. అలా ఒకప్పుడు రూ.9వేలకు పనిచేసిన భగత్ నేడు లక్షలు సంపాదిస్తున్నారు. 26 సెప్టెంబర్ 2020న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా భగత్ పనిని,అంకితభావాన్ని ప్రశంసించారు. చిన్న సమస్యకే మానసిక ఒత్తిడికి గురయ్యే యువత భగత్ ను ఆదర్శంగా తీసుకోవాలి. మరి.. దాదాసాహేబ్ భగత్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.