Bangalore: బెంగళూరులో కుక్క మాంసం స్కాం! టాప్ హోటల్స్‌లో కూడా మటన్‌కి బదులు!

బెంగళూరులో కుక్క మాంసం స్కాం! టాప్ హోటల్స్‌లో కూడా మటన్‌కి బదులు!

తక్కువ ధరకే మటన్ బిర్యానీ, కర్రీ, మాంసం వస్తుందని ఎగబడుతున్నారా..? అయితే బీ అలర్ట్. ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని కుదిపేస్తుంది మటన్. అసలు ఏం జరిగిందంటే...?

తక్కువ ధరకే మటన్ బిర్యానీ, కర్రీ, మాంసం వస్తుందని ఎగబడుతున్నారా..? అయితే బీ అలర్ట్. ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని కుదిపేస్తుంది మటన్. అసలు ఏం జరిగిందంటే...?

ఈ మధ్య ఫుడ్ కల్చర్ విస్తృతంగా వ్యాపిస్తుంది. రక రకాల ఫుడ్స్ వచ్చి చేరడంతో భోజన ప్రియులు సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు ఎగబడుతున్నారు. అందులోనూ బిర్యానీ అంటే మహా పిచ్చి. హైదరాబాద్ మహా నగరం నుండి విశ్వవ్యాప్తంగా పాకేసింది బిర్యానీ. ఇందులో ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో అన్ని ట్రై చేయాల్సిందే. అయితే వంద రూపాయలకే మటన్ బిర్యానీ, అలాగే తక్కువ ధరకే మటన్ కర్రీ అని తెలిస్తే.. పొద్దున్నే అక్కడ వాలిపోతుంటారు. ఇలా ప్రచారాలను నమ్మి వెళుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. మటన్ పేరుతో కుక్క మాంసంతో వండిన బిర్యానీని అమ్ముతున్నట్లు తేలింది. వినడానికి గుజుప్సాకరంగా, వామ్టింగ్ సెన్సేషన్ అనిపిస్తుందా.. నిజమే మరీ.. ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు మొత్తం ఇదే చర్చ నడుస్తుంది. పెద్ద స్కాం బయటకు వచ్చింది.

రాజస్థాన్ నుండి రైలులో రూ. 4,500 కిలోల బరువున్న మొత్తం 90 పెట్టేల మాంసం వచ్చింది. అయితే పెద్ద మొత్తంలో మాంసం రావడంపై హిందూ కార్యకర్తలు, బాక్సులు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే మాంసం తెచ్చిన వ్యాపారి అందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొన్ని ఆనవాళ్లను బట్టి ఇది కుక్కమాంసం అంటూ వాదన చేశాయి హిందూ సంఘాలు. ఈ మాంసాన్ని స్థానిక వ్యాపారుల సహకారంతో విక్రయిస్తున్నారని అంటున్నారు. కిలోల కొద్ది కుక్క మాంసాన్ని తీసుకు వచ్చి.. ఇక్కడ పాత బడిపోయిన మటన్ తో మిక్స్ చేసి అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాంసాన్ని స్థానిక హోటల్స్ కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అబ్దుల్ రజాక్ అనే వ్యాపారి రాజస్తాన్ నుండి కుక్క మాంసాన్ని తీసుకు వచ్చి స్థానిక మటన్ షాపు యజమానులకు అంటగడుతున్నాడని తెలుస్తుంది.

దీనిపై బీబీఎంపీ కమిషర్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే అబ్దుల్, ఇతర వ్యాపారస్థులు ఇది మటనే అంటూ వాదిస్తున్నారు. ఇదంతా చట్టబద్ధమని, మాకు ట్రైడ్ లైసెన్స్, FSSAI లైసెన్స్, BBMP లైసెన్స్ ఉన్నాయని చెబుతున్నాడు. జైపూర్ నుంచి మాంసాన్ని తెచ్చుకుంటున్నామని, నాణ్యతమైన మాంసాన్ని అమ్ముతున్నామని, ఆరోపణలన్నీ కల్పితాలు అంటూ చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వివాదంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు భారీగా పోలీసులను అక్కడకు తరలించారు. అలాగే 90 డబ్బాల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. సంబంధిత అధికారులు మాంసం నమూనాలను కూడా సేకరించారు. నివేదికకు 14 రోజులు పడుతుందని చెప్పారు.

Show comments