Krishna Kowshik
ఎన్నో రూపాయలు పోసినా తగ్గని, వైద్యులు కూడా చేతులెత్తేసినా ఎన్నో రోగాలు కూడా అనుభవం ఉన్న నానమ్మలు,తాతయ్యలు సలహాలు, సూచనలతో నయం అవుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ తన కుటుంబ సభ్యుడికే రోగం వస్తే.. ఆ ఇంట్లో పని చేసే ఓ పనిమనిషి రోగమేమిటో ఇట్టే చెప్పేసింది.
ఎన్నో రూపాయలు పోసినా తగ్గని, వైద్యులు కూడా చేతులెత్తేసినా ఎన్నో రోగాలు కూడా అనుభవం ఉన్న నానమ్మలు,తాతయ్యలు సలహాలు, సూచనలతో నయం అవుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ తన కుటుంబ సభ్యుడికే రోగం వస్తే.. ఆ ఇంట్లో పని చేసే ఓ పనిమనిషి రోగమేమిటో ఇట్టే చెప్పేసింది.
Krishna Kowshik
ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆసుపత్రికి పరిగెడుతున్నాం. పెద్ద పెద్ద రోగాలకే కాదు.. జలుబు చేసినా కూడా హాస్పిటల్‌కు వెళ్లి ఓ సారి డాక్టర్ విజిట్ చేయాల్సిందే. ఇంట్లో పెద్దలు కాస్త ఆవిరి పట్టి.. వేడి నీళ్లు తాగిస్తే.. జలుబు తగ్గుందని చెప్పినా వినిపించుకోరు. అదే డాక్టర్ దగ్గరకు వెళ్లి నాలుగొందలో, ఐదొందలో చదివించుకుని, ఓ రెండు వేలు మెడిసన్ బిల్ ఖర్చుతే కానీ మనస్సుకు తృప్తి ఉండదు. అక్కడకు వెళ్లాక వాళ్లు కూడా వేడి నీళ్లు తాగించండి, ఆవిరి పట్టండి అంటూ అవే సలహాలు డాక్టర్లు ఇస్తే కానీ బోధపడదు.. ఇంట్లో అమ్మో, అమ్మమ్మో, నానయనమ్మో అదే చెప్పారని. ఇదిగో ఇప్పుడు అదే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు ఓ పేరు మోసిన డాక్టర్. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. అతడికి వచ్చిన రోగం ఏమిటో నిర్దారించలేకపోయాడు.
కానీ ఆ ఇంట్లో పని చేసే పని మనిషి కేవలం పదంటే.. పది సెకన్లలో రోగం ఏమిటో ఇట్టే చెప్పేసింది. ఇదే విషయాన్ని మొహమాటం లేకుండా ఆ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంతకు ఏం జరిగింది. ఆ అరుదైన వ్యాధి ఏంటో చూద్దాం. కేరళలోని ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ అభి ఫిలిప్స్ ఇంట్లో ఈ విషయం జరిగింది. ఆయన కుుటంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. విపరీతమైన చలి, కీలనొప్పులు, అలసట, విచిత్రమైన దద్దుర్లు, లో ఫీవర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో డాక్టర్ సిరియాక్.. వైద్యుల సూచనలు మేరకు ..వైరల్ ఫీవర్ నుండి కరోనా, డెంగ్యూ అంటూ ప్రతి పరీక్ష చేశారు. పరీక్ష ఫలితాలన్నీ నెగిటివ్ వచ్చాయి. దీంతో రోగం ఏంటో అంతుబట్టక.. ఆ కుటుంబం సతమతౌతుంది.
అంతలో ఆ ఇంట్లో పని చేస్తున్న వృద్దురాలైన పని మనిషి వచ్చి..రోగం వచ్చిన వ్యక్తిని చూసి.. ఇది ఆంజంపని (తెలుగులో తట్టు, పొంగు)( 5వ వ్యాధి)లా ఉంది. తన మనవరాళ్లకు వచ్చాయని చెప్పింది. వెంటనే పార్వో వైరస్ B19 పరీక్ష చేయించగా.. అది పాజిటివ్ అని తేలింది. 17 సంవత్సరాల అనుభవమున్న వైద్యుడిగా తాను గుర్తించలేని రోగాన్ని.. పది అంటే పది సెకన్లలో తన పని మనిషి గుర్తించిందని చెప్పుకొచ్చాడు వైద్య నిపుణుడు. సాధారణంగా ఐదవ వ్యాధి అనేది పార్వో వైరస్ బి 19 వల్ల వస్తుంది. ఇది పెద్దల కంటే.. పిల్లల్లో సర్వ సాధారణం. ఎవరైనా దగ్గినప్పుడు,తుమ్మినప్పుడు వచ్చే స్రవాల ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఇది మొహంపై దద్దర్లు ఏర్పడతాయి. జ్వరం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి.