iDreamPost
android-app
ios-app

ఆపరేషన్‌ చేసి.. పేషెంట్‌ కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్‌

  • Published May 14, 2024 | 10:56 AM Updated Updated May 14, 2024 | 10:59 AM

ఇటీవలే ఆనారోగ్యంకు గురైన  ఓ రోగి ఆసుపత్రిలో చేరగా.. అక్కడ వైద్యుడు ఆపరేషన్‌ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇటీవలే ఆనారోగ్యంకు గురైన  ఓ రోగి ఆసుపత్రిలో చేరగా.. అక్కడ వైద్యుడు ఆపరేషన్‌ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

  • Published May 14, 2024 | 10:56 AMUpdated May 14, 2024 | 10:59 AM
ఆపరేషన్‌ చేసి.. పేషెంట్‌ కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్‌

ఇటీవల కాలంలో ఆసుపత్రిలో జరగుతున్న దారుణాలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆసుపత్రిలో డాక్టర్లు చూపించే నిర్లక్ష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎవరికైనా.. ఆరోగ్యం బాగాలేకున్నా, ఒంట్లో కస్తా నలతగా ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది వైద్యుడు. ​ఎందుకంటే.. ఆ సమయంలో ఆరోగ్యం బాధపడుతున్న రోగులకు తక్షణమే కాస్త మెరుగుడేలా చేస్తారు వైద్యలు. అందుకే కనిపించని ఆ దేవుడి కంటే ముందు వైద్యుడినే రోగులు మొక్కుతుంటారు. కానీ, ఇటీవల కాలంలో రోగులు ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా  మరోమారు ఓ డాక్టర్‌ నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే ఆనారోగ్యంకు గురైన  ఓ రోగి ఆసుపత్రిలో చేరగా.. అక్కడ వైద్యుడు ఆపరేషన్‌ చేసి మరికొంత ప్రాణాలు మీదకు తెచ్చిపెట్టారు. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్​ చేయగా.. పేషెంట్‌ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్‌లో జరిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు లోహియానగర్‌క చెందిన సల్మాన్‌ అనే వ్యక్తి పిత్తాశయంలో అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. కాగా, అక్కడ గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. ఇక వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు. ఈ క్రమంలోనే.. సర్జరీ తర్వాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు.

కాగా, ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా.. రోజురోజుకి మరింత క్షీణించ సాగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. అతడి కడుపులో దూది ఉండటం చూసి షాకయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్ట్రిప్‌ను తొలగించారు. అయితే తప్పు చేసినా.. ఆస్పత్రి వర్గాలు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బుకాయించడం విడ్డూరంగా మారింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని, సదరు ఆస్పత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోహియా నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సంజయ్ సింగ్ తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి, ఆసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యంతో పేషెంట్‌ ప్రాణాల మీదకు వచ్చిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.