P Venkatesh
Black Friday sale 2024: బ్లాక్ ఫ్రైడే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ఇంతకీ ఇది ఎందుకు జరుపుకుంటారు. బ్లాక్ ఫ్రైడే ప్రత్యేకత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Black Friday sale 2024: బ్లాక్ ఫ్రైడే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ఇంతకీ ఇది ఎందుకు జరుపుకుంటారు. బ్లాక్ ఫ్రైడే ప్రత్యేకత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
P Venkatesh
ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. అలాంటి వింతలు విశేషాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంటారు. కొన్ని విషయాలు అబ్బురపరుస్తుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి విషయమే. అదేంటంటే బ్లాక్ ఫ్రైడే సేల్. ఫెస్టివల్ సేల్స్ విన్నాం, ఫ్రీడం సేల్స్ విన్నాం మరి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటనీ అవాక్కవుతున్నారా? మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇది కూడా షాపింగ్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిందే. బ్లాక్ ఫ్రైడే సేల్ అమెరికాలో ప్రారంభమైంది. అసలు బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు. భారత్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ ట్రెండ్ ఏంటీ? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే థాంక్స్ గివింగ్ డేగా అమెరికాలో ప్రారంభమైంది. థాంక్స్ గివింగ్ డేని జరుపుకోవడానికి అమెరికా మొదట బ్లాక్ ఫ్రైడేను ఉపయోగించింది. అంటే ఈ ఏడాది నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే సేల్ జరుపుకుంటారు. అమెరికాతో పాటు వరల్డ్ లోని పలు దేశాలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ను జరుపుకుంటున్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే?.. బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డేతో, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కోసం షాపింగ్ ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజు షాపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రతీ సంవత్సరం థాంక్స్ గివింగ్ డే మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ జరుగుతుంది.
బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి ఇప్పుడు భారత్ లో కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఇ కామర్స్ సంస్థలు, బడా వ్యాపారులు బ్లాక్ ఫ్రైడే సేల్ గురించి ప్రచారం ప్రారంభించాయి. బ్లాక్ ఫ్రైడే రోజున షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్స్.. ఆఫర్‌లు అందించబడతాయి. అమెరికా నుంచి మొదలైన బ్లాక్ ఫ్రైడే ఇప్పుడు యూరప్ మీదుగా భారత్‌కు చేరుకుంది. నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగనున్నది. అసలు బ్లాక్ ఫ్రైడే అనడానికి గల కారణం ఏంటంటే.. అమెరికాలో 1970లో థాంక్స్ గివింగ్ డే తర్వాత పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. షాపింగ్ కోసం జనాలు పోటెత్తారు. వీరిలో ఎక్కువ మంది శుక్రవారంనాడు షాపింగ్ కు వచ్చారు.
ఈసమయంలో తోపులాటలు, తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. దీన్ని కట్టడి చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అప్పటి నుంచి శుక్రవారంను బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తున్నారు. భారత్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ ను 2018లో eBay తీసుకొచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఇతర ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన Amazon, Flipkart, Myntra అనేక ఇతర కంపెనీలు కూడా తమ కస్టమర్‌లకు థాంక్స్ గివింగ్ కోసం నవంబర్ చివరి శుక్రవారం బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించడం ప్రారంభించాయి. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రిటైలర్స్ తమ ప్రొడక్టులపై 50-70 శాతం డిస్కౌంట్స్, ఫ్రీ షిప్పింగ్, ఈజీ రిటర్న్ పాలసీని అందిస్తున్నాయి. బ్లాక్ ఫ్రైడే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.