iDreamPost
android-app
ios-app

బ్లాక్‌ ఫ్రైడే సేల్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్..

  • Published Nov 23, 2024 | 4:51 PM Updated Updated Nov 23, 2024 | 4:51 PM

Black Friday Sale 2024: ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కోసం బ్లాక్ ఫ్రైడే సేల్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై క్రేజీ డీల్స్ ప్రకటించాయి ఈ కామర్స్ సంస్థలు.

Black Friday Sale 2024: ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కోసం బ్లాక్ ఫ్రైడే సేల్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై క్రేజీ డీల్స్ ప్రకటించాయి ఈ కామర్స్ సంస్థలు.

  • Published Nov 23, 2024 | 4:51 PMUpdated Nov 23, 2024 | 4:51 PM
బ్లాక్‌ ఫ్రైడే సేల్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్..

ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చాక కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో ప్రకటించే ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఆయా సంస్థలు పండగలు, సమ్మర్ టైమ్ లో ప్రత్యేకమైన సేల్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. తమ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ ను అందిస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, లాప్ టాప్స్, బట్టలు ఇలా ప్రతి వస్తువుపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను అందిస్తుంటాయి. మరి మీరు కూడా ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తారా? డీల్స్ ఏం ఉన్నాయని సెర్చ్ చేస్తుంటారా? అయితే మీలాంటి వారికి అదిరిపేయే సేల్ అందుబాటులోకి వచ్చింది.

అదే బ్లాక్ ఫ్రైడే సేల్. ఇది కూడా షాపింగ్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిందే. బ్లాక్ ఫ్రైడే సేల్ అమెరికాలో ప్రారంభమైంది. క్రిస్మస్ పండగ షాపింగ్ కోసం యూస్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి శుక్రవారం రోజు షాపింగ్ కోసం ప్రత్యేకంగా ఈ సేల్‌ను తీసుకొచ్చారు. భారత్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి షురువైంది. ఈ సేల్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు క్రేజీ ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. మీకు నచ్చిన వస్తువులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొనుగోలు చేస్తే వేలల్లో లాభం పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, విజయ్‌ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్‌, టాటా క్లిక్‌ సహా మరిన్ని స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఈ సేల్ లో భాగంగా ఇ-కామర్స్‌ సంస్థలు, స్టోర్స్, షాప్స్ ప్రత్యేక తగ్గింపులు, భారీ ఆఫర్‌లను ఇస్తాయి. క్యాష్‌బ్యాక్‌, నోకాస్ట్‌ EMI సహా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ను నవంబర్ 24 నుంచి 29 వరకు నిర్వహించనుంది. అలాగే అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నది. ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంది. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్.. గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి.

సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంది. ఇక అమెజాన్ లో ఎకో డాట్, ఎకో పాప్, ఫైర్ టీవీలపై 55 శాతం డిస్కౌంట్, బీట్స్ వారి హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ పై 50 శాతం డిస్కౌంట్, హెచ్ పీ, లెనోవా, ఏసర్ లాప్‌టాప్స్‌పైన 45 శాతం డిస్కౌంట్, శాంసంగ్ ఇయర్ బడ్స్ పైన 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న వారు బ్లాక్ ఫ్రైడే సేల్ పై ఓ లుక్కేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio