iDreamPost
android-app
ios-app

రైళ్లలో 3A, 2A అంటే తెలుసు.. మరి 3E, EA అంటే ఏంటో తెలుసా?

Indian Railways: రైళ్లలో జర్నీ చేసే వారికి ఏసీ, నాన్ ఏసీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వంటి వాటి గురించి తెలిసే ఉంటుంది. ఇలానే ఏసీ క్లాసుల్లో కూడా మళ్లీ తరగతులు ఉంటాయి. దూర ప్రయాణాలుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే టైమ్ లో మాత్రం ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి.

Indian Railways: రైళ్లలో జర్నీ చేసే వారికి ఏసీ, నాన్ ఏసీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వంటి వాటి గురించి తెలిసే ఉంటుంది. ఇలానే ఏసీ క్లాసుల్లో కూడా మళ్లీ తరగతులు ఉంటాయి. దూర ప్రయాణాలుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే టైమ్ లో మాత్రం ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి.

రైళ్లలో 3A, 2A అంటే తెలుసు.. మరి 3E, EA అంటే ఏంటో తెలుసా?

మనకు ఉన్న రవాణ వ్యవస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వే వ్యవస్థ. దీని ద్వారా నిత్యం ఎంతో మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. అంతేకాక రైళ్ల టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే ప్రయాణికులకు సౌకర్యార్థం అనేక మార్పులను తీసుకొస్తుంటుంది రైల్వే శాఖ. ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తూ.. ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది ఇండియన్  రైల్వే వ్యవస్థ. ఇది ఇలా ఉంటే..  ఇక ఈ జర్నీకి సంబంధించి చాలా విషయాలు అందరికి తెలుసు..కానీ 3E, EA వంటి కొన్నికేటగిరీల జర్నీల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి..ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రైళ్లలో జర్నీ చేసే వారికి ఏసీ, నాన్ ఏసీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వంటి వాటి గురించి తెలిసే ఉంటుంది. ఇలానే ఏసీ క్లాసుల్లో కూడా మళ్లీ తరగతులు ఉంటాయి. తక్కువ దూరం జర్నీ చేసే సమయంలో వీటికి గురించి పెద్దగా అవసరం లేదు. కానీ దూర ప్రయాణాలుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే టైమ్ లో మాత్రం ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా స్లీపర్, 3ఏ, 2ఏ క్లాసుల గురించి అందరికి తెలుసు. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు ఎప్పుడైన గమనిస్తే.. CC, EC, 3E, EA వంటివీ కూడా దర్శనమిస్తుంటాయి.

ఫస్ట్‌ ఏసీ (1A) అనేది మనకు టికెట్ బుకింగ్ సమయంలో కనిపిస్తుంది. మొదటి తరగతి ఏసీ స్లీపర్ ను 1ఏగా పేర్కొంటారు. ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్‌మెంట్లే ఉంటాయి. ఇందులో మాములు స్లీపర్ మాదిరిగా సైడ్‌ అప్పర్‌, సైడ్‌ లోయర్‌ బెర్తులేవీ ఉండవు. అంతేకాక 2 బెర్తులుండే కంపార్ట్‌మెంట్‌ను కూప్‌ అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్‌గా పిలుస్తుంటారు. తమ కంపార్ట్‌మెంట్‌కు లాక్‌ వేసుకోవచ్చు. ఒక్కో బోగీలో 18-24 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను హెచ్-1, హెచ్-2 అని సూచిస్తారు.

2A:

సెకండ్‌ క్లాస్ ఏసీ లేదా టు-టైర్‌ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లలో కేవలం 45-54 సీట్లు ఉంటాయి. ఇందులో మిడిల్‌ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్‌లు ‘ఏ’ అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌ ఇచ్చేటప్పుడు ఏ1, ఏ2 అని సూచిస్తారు. టికెట్‌ జారీ చేసేటప్పుడు మాత్రం H2 26 అని ముద్రిస్తారు.

3AC:

రైళ్లలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్‌ ఇదే. స్లీపర్‌ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా 3 ఏసీని ఎంచుకుంటారు. 3ఏసీకి సంబంధించి ఒక్కో కోచ్‌లో 64-72 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను గుర్తు పట్టేందుకు ‘బి’ అనే అక్షరంతో సూచిస్తారు.

3E:

థర్డ్  ఎకానామిని క్లాస్ నే 3ఇ గా సూచిస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని రైళ్లలో ఈ క్లాసులు దర్శనమిస్తుంటుంది. థర్డ్‌ ఏసీ కంటే  వీటి ధర టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ తరహా కోచ్‌లలో కేవలం 72 నుంచి 81 బెర్తులు ఉంటాయి. గరీబ్‌రథ్‌ వంటి ఎక్స్  ప్రెస్ రైళ్లలో ఈ కేటగిరి కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లను ‘ఎం’తో సూచిస్తారు.

స్లీపర్‌ క్లాస్ (SL):

స్లీపర్‌ కోచ్‌ల గురించి చాలా మందికి సుపరిచితమే. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు ఈ తరగతిని ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72-81 బెర్తులు ఉంటాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 8 బెర్తులు ఉటాయి. ఈ కోచ్‌లను S అక్షరంతో సూచిస్తారు. కొన్నిసార్లు ఆ రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్‌ ఇస్తారు.

EC:

ఈసీనే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని కూడా పిలుస్తారు. ఇది ఫ్లైట్ లోని బిజినెస్ క్లాస్ ను పోలీ ఉంటుంది. ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది. ఇందులో స్లీపర్ బెర్తులు ఉండవు. ఇవి వందేభారత్‌ రైళ్లలో అందుబాటులో ఉన్నాయి. దీంతో  వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కోచ్‌లను ‘ఇ’ అక్షరంతో సూచిస్తారు.

EA:

ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాసుగా పిలుస్తారు. ఇది శతాబ్ది వంటి రైళ్లలో ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌లు కనిపిస్తాయి. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు ఈఏ(EA) పేరుతో ఈ కోచ్‌లు ఉంటాయి. ఏసీతో కూడిన 56 చైర్లు ఉంటాయి. మూవీస్, సంగీతం వినేందుకు ఎల్‌సీడీ స్క్రీన్లు ఉంటాయి. ఆటోమేటిక్‌ డోర్స్‌ ఏర్పాటు ఉంటుంది. ఈ కోచ్‌లకు ‘కె’ అక్షరంతో సూచిస్తారు.

వీటితో పాటు ఏసీ ఛైర్ కార్(CC), విస్టాడోమ్(Ev)వంటి క్లాసులు కూడా ఉన్నాయి. విస్టాడోమ్ క్లాసులో నాన్‌ ఏసీ కోచ్‌లను DV అని, ఏసీ కోచ్‌లను EVగా సూచిస్తారు. అలా రైల్వే వ్యవస్థలో అనేక ప్రత్యేక గుర్తులు, క్లాసులు ఉంటాయి. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో వీటిని జాగ్రత్తగా చూసుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం భారత దేశంలో రైల్వే వ్యవస్థకు మంచి ఆదరణ ఉంది.